పయనించే సూర్యుడు అక్టోబర్ 29 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)
ఆంధ్రప్రదేశ్ స్టేట్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ బోర్డ్ మీటింగ్ ఏపీఎస్ ఎం ఎఫ్ సి చైర్మన్ అయినటువంటి మౌలానా షేక్. ముస్తాక్ అహ్మద్ అధ్యక్షతన ఈ రోజు విజయవాడలోని మినర్వ గ్రాండ్ హోటల్ నందు జరిగినది.ఈ కార్యక్రమంలో బోర్డు మీటింగ్ లో పాల్గొని చైర్మన్ ని మర్యాద పూర్వకంగా కలిసిన ఏపీ స్టేట్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ షేక్.సల్మా షిరీన్ ఈ అవకాశం కల్పించిన పెద్దలు, మాకు దైవ సమానులు అయినటువంటి ఆంధ్రా రాష్ట్ర దేవాదాయ ,ధర్మాదాయ శాఖ మంత్రి వర్యులు ఆనం రామనారాయణ రెడ్డి కి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి కిమ్స్ హాస్పిటల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ తాళ్లూరి గిరినాయుడు కి ఆమె ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు

