
పయనించే సూర్యుడు న్యూస్ జూన్ 12 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి
ఆల్విన్ కాలనీ డివిజన్ కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు అనిల్ రెడ్డి జన్మదిన వేడుకలను గురువారం మైసిగండి అమ్మవారి దగ్గర ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి పలువురు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై శాలువాతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ ఆల్విన్ కాలనీ డివిజన్ లో పార్టీ ప్రతిష్టకు కృషిచేస్తూ ప్రభుత్వం చేపడుతున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీ అభివృద్ధికి తోడ్పాటు అందించడంలో ముందుంటారని వారు అన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని పదవులు చేపట్టి పార్టీని మరింత బలోపేతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కూకట్పల్లి సీనియర్ పాత్రికేయులు నవీన్ రెడ్డి కోహిర్ నాగరాజు నామాల శ్రీధర్ గౌడ్ చింతకుంట్ల శ్రీనివాస్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
