
పయనించే సూర్యుడు నవంబర్ 3,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న
ఈ సందర్బంగా ఎమ్మార్పీఎస్ మండలం అధ్యక్షులు నిలువుగండ్ల నవీన్, ఎం ఎస్ పి మండల నాయకులు దండు రామసుబ్బయ్య ఆర్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షులు బందెల ఓబులేసు లు మాట్లాడుతూ,ఇటీవల కురుసిన భారీ వర్షానికి నంద్యాల జిల్లా తో పాటు కోయిలకుంట్ల మండలం లోని అన్ని గ్రామాలు పూర్తిగా అటు వ్యవసాయం రంగం లో, పూరిగుడిసెలు మట్టిమిద్దెలు పాడి పాడిపరిశ్రమ లు సైతం అమాంతం నష్ట పోవడం చాలా బాధాకరమణి వారు ఆవేదన వ్యక్తం చేశారు.అనంతరం కొన్ని సమస్యలు కోయిలకుంట్ల మండల తహసీల్దారు పవన్ కుమార్ రెడ్డి కి వినతిపత్రం అందజేశారు.అందులో భాగంగా తీవ్ర వర్షానికి కూలిన మట్టిమిద్దెలకు 50000,చెల్లించాలని అదేవిదంగా, నిబంధనలు పక్కన పెట్టి కొత్త గా ప్రభుత్వం బిల్డింగ్ లు నిర్మించాలని, అంతేకాకుండా ప్రతి కుటుంబానికి 25వేల రూపాయాలు నగదు తో పాటు నిత్యావసర సరుకులు అందజేయాలనీ, పూర్తిగా దెబ్బతిన్న కాలనీ ల కు మరమ్మతులు చేపించాలని, తీవ్రంగా వర్షం వల్ల ఇబ్బంది పడ్డ ప్రజానీకానికి అన్నివిధాలాల ప్రభుత్వం ఆదుకోవాలి అని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ కోరారు.
ఈ కార్యక్రమం లో ఎమ్మార్పీఎస్ టౌన్ అధ్యక్షులు అరదేశీ రమేష్,కొమ్ము సుబ్బారాయుడు, డీలర్ జడల వెంకట్ ప్రవీణ్ కుమార్,కొమ్ము చిన్న రాముడు,తదితరులు ఫాల్గొన్నారు.
