సిపిఐ(ఎం) నేత భూక్యా వీరభద్రం డిమాండ్
పయనించే సూర్యుడు అక్టోబర్ 30 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్
వైరా నియోజకవర్గ వ్యాప్తంగా మొంథా తుఫానుతో వర్షం, ఈదురుగాలుల కారణంగా చేతికొచ్చిన పంటలు వరి, పత్తి, మొక్కజొన్న, మిరప వంటి తదితర పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. భారీ నష్టం ఎదుర్కొన్న రైతులు ఆర్థికంగా దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారని సిపిఐ(ఎం) వైరా డివిజన్ కమిటీ కార్యదర్శి భూక్యా వీరభద్రం తెలిపారు.రైతులు పెట్టుబడులు పెట్టి ఎంతో కష్టపడి చేతికి వచ్చిన పంటలు నేటి పాలు అయ్యాయి. ప్రభుత్వం వెంటనే పంట నష్టం అంచనా వేసి రైతులకు తగిన నష్టపరిహారం అందించాలి అని అన్నారు.తుఫానుతో పంటలు దెబ్బతిన్న బాధలో ఉన్న రైతాంగానికి మనోధైర్యం కల్పించి ఆర్థికంగా ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని ఆయన గుర్తు చేశారు.రైతుల కష్టార్జితం పంటలు తుడిచిపెట్టుకుపోయిన ఈ పరిస్థితిలో కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే వ్యవసాయ నష్టం అంచనా వేసి ప్రతి రైతుకు సరైన నష్టపరిహారం ప్రకటించాలి, అని ఆయన డిమాండ్ చేశారు. రైతుల పట్ల ప్రభుత్వం కనీసం సానుభూతి చూపి వెంటనే సహాయ చర్యలు ప్రారంభించి. నష్టపోయిన పంటల వివరాలను గ్రామస్థాయిలో సర్వే చేసి తక్షణ ఉపశమన చర్యలు చేపట్టాలి” అని ఆయన పేర్కొన్నారు.రైతుల కష్టాన్ని గుర్తించి పంట నష్టాన్ని ప్రభుత్వాలు పూర్తిస్థాయిలో ఆదుకోకపోతే సిపిఎం ఆధ్వర్యంలో రైతులను సమీకరించి ఆందోళనలు చేస్తాం అని ఆయన తెలిపారు .

