పయనించే సూర్యుడు అక్టోబర్ 28,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న
భారీ వాహనాలను రాత్రి 7 గంటల నుండి సురక్షితమైన ప్రాంతాలలో నిలుపుకోవాలి.
అవసరమైతే తప్ప ప్రజలు బయటికి రావద్దు.ప్రయాణాలు చేయరాదు.వదంతులు సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షెరాన్.
వాతావరణ శాఖ సమాచారం ప్రకారం ఇప్పటికే నంద్యాల జిల్లాకు”మొంథా” తుఫాన్ ప్రభావం వలన ఆరెంజ్ అలర్ట్ ఇచ్చిన నేపథ్యంలో జిల్లాలో భారీగా వర్షాలు కురుస్తున్న సందర్భంగా పోలీస్ అధికారులు అప్రమత్తంగా ఉంటూ ప్రజలను ప్రమాదాల బారిన పడకుండా అప్రమత్తం చేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షెరాన్ IPS అత్యవసరంగా ఈ మార్గదర్శకాలను జారీ చేశారు.జిల్లా ప్రజలకు,పోలీసు అదికారులకు ఎస్పీ ముఖ్యమైన సూచనలు,జాతీయ రహదారులలో ప్రయాణించే భారీ వాహనాలను రాత్రి 7 గంటల నుంచి సురక్షితమైన ప్రాంతాలలో నిలుపుకోవాలి.రాత్రి ప్రయాణాలు చేయరాదు.
విపరీతంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అత్యవసర పరిస్థితుల్లో తప్ప వర్షంలో బయటకు వెళ్లొద్దని అనవసర ప్రయాణాలు చేయవద్దు. భారీ వర్షం లేదా ఈదురుగానుల సమయంలో ప్రజలు స్తంభాలు లేదా చెట్ల కింద నిలబడవద్దు.ముఖ్యంగా మట్టి మిద్దెలలో ఉన్న వారు శిథిలావస్థకు చేరుకున్న ఇళ్లలో ఉన్నవారు అప్రమత్తంగా ఉండాలి. వర్షం పడే సమయంలో సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలి.నిరంతరం ప్రజలు అప్రమత్తంగా ఉంటూ ఏదైనా కాలువలు, వాగులు, వంకలు, నదులు ప్రమాదకర స్థాయిలో ఉంటే లేదా వరదలు వచ్చే అవకాశం ఉంటే, వెంటనే సంబంధిత స్థానిక పరిపాలనాధికారులకు అధికారులు, పోలీసు, రెవెన్యూ అధికారులు సమాచారం తెలియజేయాలని కోరారు. తుఫాన్ ప్రభావం విద్యుత్ అంతరాయం, ఇళ్లల్లోకి నీరు చేరడం, చెట్లు లేదా విద్యుత్ స్తంభాలు వైర్లు తెగిపోవడం, ఎవరైనా ప్రమాదంలో ఉన్న పోలీస్ టోల్ ఫ్రీ నెంబర్ 112 కు కాల్ చేసి తక్షణ సహాయం పొందవచ్చు. నంద్యాల జిల్లా ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండి పై సూచనలు పాటించి సహకరించాలని పోలీస్ అధికారులు విజ్ఞప్తి చేశారు.
జిల్లా పోలీస్ కార్యాలయం,నంద్యాల.

