
ఇప్పటికే రైతులు తక్కువ ధరకు దళారులకు అమ్ముకుంటున్నారు
రైతుకు మద్దతు ధర కచ్చితంగా చెల్లించాలి
మాజీ ఎమ్మెల్యే వై మాజీ ఎమ్మెల్యే వై.అంజయ్య యాదవ్
( పయనించే సూర్యుడు అక్టోబర్ 13 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ )
మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను తక్షణమే ప్రారంభించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే వై.అంజయ్య యాదవ్ సూచించారు. గ్రామీణ ప్రాంతాలలో రైతులు ఇప్పటికే పంటలను కోస్తూ ధాన్యాన్ని నిల్వ చేసుకుంటున్నారని, కొందరు రైతులు తక్కువ ధరకే దళారులకు అమ్ముకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ యేడు మొక్కజొన్న దిగుబడి అధికంగా వచ్చే అవకాశం ఉందని, అందుకు తగిన విధంగా ప్రభుత్వం మౌలిక వసతులను కల్పించాలని కోరారు. ప్రభుత్వ మద్దతు ధర రూ. 2400 ఉందని, ప్రతి రైతుకు ప్రభుత్వం మద్దతు ధర వర్తించే విధంగా సమంత శాఖ అధికారులు చొరవ చూపాలని కోరారు. పలు ప్రాంతాలలో ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల గ్రామీణ ప్రాంతాల రైతులు తమ పంటను కేవలం రూ. 1800 నుంచి 2000 లకే క్వింటాలు చొప్పున అమ్ముకొని నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి క్లస్టర్ పరిధిలో ప్రభుత్వ మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులకు సంపూర్ణ సహకారం అందించాలని సూచించారు.