
కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తల బృందం
పయనించే సూర్యుడు ఆగస్టు 13 (పొనకంటి ఉపేందర్ రావు )
టేకులపల్లి: మండలంలోని బోడు గ్రామ పరిధిలో కృషి విజ్ఞాన కేంద్రం కొత్తగూడెం శాస్త్రవేత్తల బృందం ఆధ్వర్యంలో బుధవారం సేద్య విభాగం శాస్త్రవేత్త డాక్టర్ టి భరత్ విస్తరణ శాస్త్రవేత్త డాక్టర్ ఎన్ హేమ శరత్ చంద్ర శాస్త్రవేత్త శివ టేకులపల్లి పరిధిలో వరి పత్తి మొక్కజొన్న పంటలు క్షేత్రస్థాయిలో పరిశీలన చేయడం జరిగింది ఈ అధిక వర్షాలలో పత్తి పంటలో నీరు నిలువకుండా చూసుకోవాలని సూచించారు అధిక తేమా ఉండటం వల్ల పత్తి పంటలలో వీరు కుళ్ళు మెగ్నీషియం తాకు లోపం వచ్చే అవకాశం ఉందని చెప్పారు ప్రతి పంటలో వీరు కుళ్ళు నివారణకు కాపర్ ఆక్సి క్లోరైడ్ మూడు గ్రాములు లీటర్ నీటికి లేదా కార్బన్డజం ఒక గ్రామం లీటర్ నీటికి కలుపుకొని పత్తి మొక్కలు గుంపులు గుంపులుగా చనిపోయిన ప్రదేశాలలో ఆ ద్రావణాన్ని మొక్కల మొదలలో పోయాలి అదే విధంగా అధిక తేమ ఉన్న పరిస్థితులలో మొక్క పోషకాలను తీసుకోలేదు కాబట్టి 19- 19- 19- లేదా 13 -0-45 మర్చి కే 10 గ్రాములు ఒక లీటర్ నీట్ కి కలుపుకొని పైపులుగా పిచికారి చేసుకుంటే పత్తి పంటను అధిక తేమ పరిస్థితి నుండి కాపాడుకోవచ్చునని రైతులకు శాస్త్రవేత్తలు సూచించారు అదేవిధంగా నేరుగా వెదజల్లే పద్ధతిలో విత్తన వరి క్షేత్రాన్ని పరిశీలించిన తర్వాత కలుపు ఎక్కువగా ఉండటం వలన కలుపు నివారణకు సైలోప్యుటైల్ ప్లస్ పెనాక్యుల సన్ అనే కలుపు మందును ఒక లీటర్ వాటర్ కు 200. లీటర్ల నీటిలో కలుపుకొని పిచికారి చేయవలసిందిగా రైతులకు శాస్త్రవేత్తలు సూచించారు ఈ యొక్క కార్యక్రమంలో బోర్డు వ్యవసాయ విస్తరణ అధికారి పి రమేష్ మరియు రైతులు భూక్య సైదులు నాయక్ బి నరేందర్ సద్గురు తదితరులు పాల్గొన్నారు