Thursday, March 6, 2025
HomeUncategorizedమొక్కలకునీళ్లు పోశినజిల్లా కలెక్టర్ ఆశిష్

మొక్కలకునీళ్లు పోశినజిల్లా కలెక్టర్ ఆశిష్

Listen to this article


పయనించే సూర్యుడు గాంధారి- తేది 18-2-2025 వేసవి కాలం దృష్ట్యా మొక్కలకు వాటరింగ్ నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. గళవారం గాంధారి మండలం పేట్ సంగం గ్రామంలో రోడ్డుకిరువైపులా ఉన్న మొక్కలకు కలెక్టర్ నీళ్లు పోశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఉష్ణోగ్రత పెరుగుతున్న సందర్భంలో మొక్కలకు ప్రతీ రోజూ నీళ్ళు పోయాలని, మొక్కలను సంరక్షించాలని తెలిపారు. చనిపోయిన మొక్కల స్థానంలో కొత్తగా మొక్కలను నాటాలని తెలిపారు. షిగ్రిగేషన్ షేడ్ నిర్వహణ సక్రమంగా లేదని, ఇంటింటి తడి పొడి చెత్త సేకరణ నిర్వహించాలని, వర్మి కంపోస్టు తయారు చేయాలని తెలిపారు. చెత్తను గీతలో వేయకుండా ఇతర దూర ప్రాంతంలో వేయడం పై ఆగ్రహాన్ని వ్యక్తం చేసారు. వైకుంఠ ధామంలో మొక్కలను పెంచాలని సూచించారు. అనంతరం నర్సరీ లో మొక్కల పెంపకం ను పరిశీలించారు. ఏయే మొక్కలు పెంచుతున్నారు, అవసరం మేరకు పెంచాలని తెలిపారు. ఫిజికల్ సైన్స్, ఇంగ్లీష్ సబ్జెక్టు లలో ద్యార్థులచే బోర్డుపై జవాబు రాబట్టిన కలెక్టర్ పేట్ సంగం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ని పదవ తరగతి విద్యార్థులు వార్షిక పరీక్ష లకు సన్నద్ధత పై హెడ్ మాస్టర్, టీచర్లను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు ఉదయం 5 గంటలకే నిద్రలేవడం అలవాటు చేసుకోవాలని, ఉదయం పూట చదువుకోవాలని తెలిపారు. విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని, చదువులో వెనుకబడిన విద్యార్థుల పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, సబ్జెక్టు లో వారీగా రివిజన్ చేయించాలని లిపారు. పదవతరగతి తర్వాత ట్రిపుల్ ఐటీ చదవాలని సూచించారు. ఆ దిశగా విద్యార్థులను తయారు చేయాలని అన్నారు. అనంతరం ఫిజికల్ సైన్స్, ఇంగ్లీష్ పాఠాలలోని ప్రశ్నలను అడిగి బోర్డులపై రాయించారు. విద్యార్థుల్లో దాగి వున్న ప్రతిభను కలెక్టర్ రాబట్టారు. పరీక్షల నేపథ్యంలో ఒత్తిడికి లోనుకాకుండా శ్రద్ధతో చదవాలని తెలిపారు. ఇష్టమైన, కష్టమైన సబ్జెక్టుల గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అర్థం కాని సిలబస్ ఉంటే టీచర్ లను అడిగి మస్యను నివృత్తి చేసుకోవాలని తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని తెలిపారు. భజనం వండే కు ముందు బియ్యం ను సరిగా కడగాలని తెలిపారు. పాఠశాలలు మిషన్ భగీరథ పైప్ లైన్ వేయాలని ఏఈఈ నీ ఆదేశించారు. మధ్యాహ్న భోజనం ఎలా ఉందని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ ర్యక్రమాల్లో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సురేందర్, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్ రావు, మండల ప్రత్యేక అధికారిని లక్ష్మీ ప్రసన్న, తహసీల్దార్ సతీష్ రెడ్డి, ఎంపీడీఓ రాజేశ్వర్, ఎంపీఒ లక్ష్మీ నారాయణ, తదితరులు పాల్గొన్నరు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments