
పయనించే సూర్యుడు న్యూస్ ఆగస్టు 5 సూర్యాపేట జిల్లా ప్రతినిధి:
101 ఫోన్స్ ను బాధితులకు అందించిన సూర్యాపేట జిల్లా ఎస్పీ.
ఫోన్ రికవరీ చేయడం కోసం పోలీసు సిబ్బంది చాలా కృషి చేశారు.మొబైల్ ఫోన్ పోయిన చొరికి గురైనా మొబైల్ www.ceir.gov.in(సీర్ )అప్లికేషన్ నందు నమోదు చేసుకోవాలి. పోలీస్ శాఖ మీకోసం ఉన్నది, సేవలు సద్వినియోగం చేసుకోవాలి. సామాన్యులకు పోలీసులు ఎప్పుడు మిత్రులే అని గుర్తించాలి. మోసాలు,నేరాలు చేసే వారిపట్ల మాత్రమే కఠినంగా ఉంటాం.సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ: ప్రజలు వివిధ రూపాల్లో పోగొట్టుకున్న ఫోన్స్ ను జిల్లా పోలీసులు పటిష్టంగా పని చేసి 101 ఫోన్స్ ను స్వాధీనం చేసుకున్నారు,దీనిలో భాగంగా సోమవారం రోజున జిల్లా పోలీస్ కార్యాలయంలో సెల్ ఫోన్ రికవరీ మేళా ఏర్పాటు చేసి సుమారు 20 లక్షల రూపాయల విలువ గల 101 ఫోన్ల ను జిల్లా ఎస్పీ నరసింహ చేతుల మీదుగా బాధితులకు అందజేయడం జరిగినది.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రస్తుత రోజుల్లో మొబైల్ ఫోన్ శరీరంలో బాగమైనది,దీనిని కమ్యూనికేషన్ కోసం,ఆన్లైన్ విద్య కోసం,జ్ఞాపకాలు పదిలం చేసుకోవడం కోసం,బ్యాంక్ అకౌంట్ నిర్వహణకోసం,సోషల్ మీడియా కోసం వినియోగిస్తున్నాం అన్నారు, మొబైల్ చోరికి గురైనా,పోగొట్టుకున్నా అందులో ఉన్న సమాచారం పోతుంది కావున మొబైల్ వినియోగదారులు జాగ్రత్తగా ఉండాలి అని ఎస్పీ సూచించారు.ఎవరైన మొబైల్ పోగొట్టుకున్న లేదా దొంగిలించబడిన వెంటనే సీర్ పోర్టల్ https://www.ceir. gov.in నందు నమోదు చేసుకోవాలి, మొబైల్ ను బ్లాక్ చేసి,మీ సేవా ద్వారా దరఖాస్తు సంభందిత పోలీస్ స్టేషన్ లో సమాచారం ఇవ్వాలని సూచించారు. సైబర్ మోసాలు,గంజాయి వల్ల జరిగే అనర్ధాలు,అసంఘిక కార్యకలాపాల గురించి వివరించి ఇక్కడ ఉన్నవారు మీ చుట్టూ ఉన్న వ్యక్తులకు అవగాహన కల్పించాలి అని కోరారు.పోలీసులు ప్రజల రక్షణకోసం ఉన్నారు,పోలీసు సేవలను సద్వినియోగం చేసుకోవాలి, సమస్యలపై ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదు చేయాలి,డయల్ 100 కు సమాచారం ఇవ్వాలని కోరారు.ప్రజల రక్షణలో పోలీసులు నిరంతరం కృషి చేస్తున్నారు,సామాన్యులకు పోలీసులు మిత్రులు,నేరాలకు పాల్పడేవారు పట్ల కఠినంగా వ్యవహరిస్తాము అన్నారు. జిల్లాలో వివిధ రూపాల్లో వినియోగదారులు పోగొట్టుకున్న మొబైల్ ఫోన్స్ ను సీర్ అప్లికేషన్ ద్వారా రికవరీ చేసి బాధితులకు అప్పగించడంలో కృషి చేస్తున్న ఐ.టి కోర్ సిబ్బందిని,పోలీస్ స్టేషన్ సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు.ఇతర రాష్ట్రాల నుండి ఫోన్స్ రికవరీ చేయడం జరిగినది అన్నారు. జిల్లా ఎస్పీకి పోలీస్ డిపార్ట్మెంట్ కు అభినందనలు తెలిపిన బాధితులు.. జిల్లా నలుమూలల నుండి వచ్చిన బాధితులు పోయిన మొబైల్ ఫోన్లు మళ్లీ దొరికినందుకు,ఫోన్ రికవరీ చేసి అందించినందుకు సంభందిత బాధితులు జిల్లా ఎస్పీకి,పోలీస్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.బాగా పని చేస్తున్నారు అని అభినందించారు. సైబర్ మోసగాళ్ల నుండి జాగ్రత్తలు పాటించాలి ప్రస్తుతం మొబైల్ ద్వారా అన్ని బ్యాంక్ లావాదేవీలు జరుగుతున్నాయని,సోషల్ మీడియా అకౌంట్స్ నిర్వహిస్తున్నము, వ్యక్తిగత ఫోటోలు ఉంటున్నాయి ఫోన్ ను ఎవరైనా దొంగలించి మన సమాచారం తస్కరించి నష్టం చేసే అవకాశం ఉన్నది అని ఎస్పీ అన్నారు.మొబైల్ ఫోన్లకు పంపించే బ్లూ లింకులను అనుసరించవద్దు,వ్యక్తిగత వివరాలు ఎవరైనా అడిగితే వారికి బ్యాంక్ ఖాతాకు సంబంధించిన వివరాలు తెలపవద్దు అని తెలిపారు.బహుమతులు వచ్చాయి ప్రాసెస్ ఫీజు చెల్లించండి,తక్కువ ఇంట్రెస్ట్ కు లోన్ ఉన్నది ప్రాసెస్ ఫీజు చెల్లించండి అంటే ఇలాంటి మాయమాటలు ఎవరు నమ్మవద్దు ఇలాంటి వాటి వెనుక సైబర్ మోసగాళ్లు ఉంటారనేది గుర్తించండి అని తెలిపినారు. గంజాయి,అసాంఘిక కార్యకలాపాలు పై సమాచారం ఇవ్వాలి. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ రవీందర్ రెడ్డి,ఐటి కోర్ ఆర్‌ఎస్సై రాజశేఖర్,ఐటి కోర్ సిబ్బంది,పోలీస్ స్టేషన్ సిబ్బంది మొబైల్ పోగొట్టుకున్న బాధితులు ఉన్నారు..