
పయనించే సూర్యుడు అక్టోబర్ 15,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న
నంద్యాల పట్టణంలో సిపిఎం,సిపిఐ,సిపిఐ (ఎంఎల్) పార్టీల ఆధ్వర్యంలో మోడీ గో బ్యాక్ కార్యక్రమం బాగా సక్సెస్ అయింది, నరేంద్ర మోడీ ఉమ్మడి కర్నూలు జిల్లాకు వస్తున్న నేపథ్యంలో వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో 300 పైగా వామపక్ష పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు, రాష్ట్రానికి ప్రత్యేక హోదా విభజన హామీలు అమలు చేయకుండా మన జిల్లాకు రావడం చాలా బాధాకరం.జీఎస్టీ పేరు మీద ప్రజల యొక్క సొమ్ము 55 లక్షల కోట్లకు పైగా ఆదాని,అంబానీ లాంటి కార్పొరేట్లకు దోచి పెట్టాడు,కేవలం 48 వేల కోట్లు మాత్రమే జీఎస్టీ ద్వారా తగ్గించి, జిఎస్టిని తగ్గించి ప్రజలకు మేలు చేశారని గొప్పలు చెప్పుకుంటున్నారు.నరేంద్ర మోడీ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు, ఇవే కాదు కడప ఉక్కు రాయలసీమ హక్కు అనే నినాదాన్ని కూడా తుంగలో తొక్కాడు, కడపకు స్టీల్ ప్లాంట్ ఇవ్వకుండా రాయలసీమకు మోసం చేశాడు.ఇలాంటివి మన రాష్ట్రానికి ఎన్నో వాగ్దానాలు చేసినా మోసకారి మోడీని మన యొక్క జిల్లాకు రావడం చాలా దౌర్భాగ్య పరిస్థితి,,ఈ యొక్క కూటమి ప్రభుత్వ నేతలకు సిగ్గు ఉండాలా కళ్ళముందే రాష్ట్రానికి ఇంత అన్యాయం జరుగుతుంటే ప్రజాధనాన్ని లూటీ చేసి లక్షల మంది జనాలను మోడీ బహిరంగ సభకు తోలడం చాలా బాధాకరము. కాబట్టి ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం నేతలు అందరూ రాయలసీమకు రావలసిన వాగ్దానాలన్నింటినీ అమలు చేపించుకోవాల్సిందిగా వామపక్ష పార్టీలుగా కోరుతున్నాము, లేకుంటే ఆంధ్రప్రదేశ్ ద్రోహులుగా చరిత్రలో మీరు కూడా నిలబడతారు, తక్షణమే ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు,ఈ యొక్క కార్యక్రమంలో సిపిఎం, సిపిఐ,సిపిఐ (ఎంఎల్) నాయకులు పాల్గొనడం జరిగింది