
షాద్ నగర్ ఎమ్మెల్యే “వీర్లపల్లి శంకర్”
రూ. 1.20 కోట్లతో 1.5 కిలోమీటర్ బిటి రోడ్డు నిర్మాణ శంకుస్థాపన పనులు
తరలివచ్చిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు,గ్రామ ప్రజలు
( పయనించే సూర్యుడు జూలై 23 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ )
రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం మోత్కూల గూడ గ్రామ నుంచి కేసారం వరకు రూ.1.20 కోట్ల నిధులతో నిర్మిస్తున్న బీటీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే వీర్ల పల్లి శంకర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అభివృద్ధి చెందాలి పూర్తిగా గ్రామాలు అనే సదుద్దేశంతో మోత్కూల గూడ గ్రామ నుండి కేసారం వరకు లింకు రోడ్డు చేయడం ద్వారా మోత్కల గూడ గ్రామ ప్రజలు, కేసారం గ్రామ రైతులు ఎన్నో రోజుల నుంచి రోడ్డు సౌకర్యం సరిగా లేనందున ఇబ్బందులు పడుతున్నారు. మార్కెట్ కి వెళ్లి రావడానికి ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. దిన స్థితిలో ఉన్న రోడ్డును బీటీ రోడ్డు గా మారుస్తున్నాము. అందులోనే భాగంగానే వివిధ గ్రామాలలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తున్నాము.కావున మొట్టమొదటిగా నందిగామ మండలం మోత్కూల గూడ గ్రామంలో బీటీ రోడ్డు పనులు శంకుస్థాపన చేయడం జరిగింది.రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా దూసుకుపోతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో నందిగామ మండలం కాంగ్రెస్ పార్టీ నాయకులు, మోత్కూల గూడ గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు,గ్రామ ప్రజలు, తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
