
సంస్కృతి సంప్రదాయాలను భావితరాలకు అందించాలి
కరస్పాండెంట్ వాజిద్ భాష
ఆటపాటలతో అల్లరించిన విద్యార్థులు
( పయనించే సూర్యుడు సెప్టెంబర్ 20 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ )
రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలోనీ మ్యాగ్నెట్ స్కూల్ ఆఫ్ ఎక్స్లెన్స్ కరస్పాండెంట్ వాజిద్ పాషా ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. విద్యార్థినిలు మరియు ఉపాధ్యాయునిలు రంగురంగు పువ్వులతో బతుకమ్మలను తయారు చేశారు. అనంతరం బతుకమ్మ ఆటపాటలతో విద్యార్థులు అల్లరించారు. ఈ సందర్భంగా కరస్పాండెంట్ వాజిద్ పాషా మాట్లాడుతూ… విద్యార్థులకు చిన్ననాటి నుంచే మన సంస్కృతి సంప్రదాయాలను నేర్పించాలననే ఉద్దేశంతో మా పాఠశాలలో ప్రతి పండుగను ఘనంగా నిర్వహించడం జరుగుతుందని, దానిలో భాగంగానే ఈరోజు బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించడం జరిగిందని అన్నారు. మన సంస్కృతి సంప్రదాయాలు భావితరాలకు అందించడం లో మన వంతు పాత్ర ఉండాలని కరెస్పాండెంట్ వాజిద్ భాష ఉన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరికులం డైరెక్టర్ వినోద్, స్కూల్ ప్రిన్సిపాల్ ఆనంద్, వైస్ ప్రిన్సిపల్ ఆసిఫ్ మరియు ఉపాధ్యాయులు విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
