పయనించే సూర్యుడు అక్టోబర్ 30(సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు )
సూళ్లూరుపేట మున్సిపాలిటీ పరిధిలో అక్టోబర్ 29న హోలీ క్రాస్ సర్కిల్ దగ్గర ఒక నిండు ప్రాణం బలైంది ఎవరు దీనికి బాధ్యత వహిస్తారు ఒక కుటుంబం పెద్ద చనిపోతే ఆ కుటుంబం పరిస్థితి ఏమౌతూందో ఆలోచించని నేటి యువత కు పోలీసు శాఖ వారు ఈ పరిసర ప్రాంతాలలోని ప్రైవేటు మరియు ప్రభుత్వ కాలేజ్ లలోఒక అరగంట అవగాహన సదస్సు నిర్వ హించి యువకులకు బైక్ రైడింగ్ గూర్చి అధిక వేగంతో బైక్ లను రైడ్ చేస్తే తీవ్ర చర్యలు చేపడతా మని కచ్చితంగా 30 40 కిలోమీటర్ల పైన స్పీడ్ పోకుండా ఒక బైక్ పైన ఇద్దరు పైన పట్టణంలో ప్రయాణించడానికి అవకాశం లేదని స్పష్టం చేయడం వంటి తక్షణ చర్యలు చేపట్టడం చాలా మంచిది అలాగే ఒక ప్రసార కార్యక్రమం ద్వారా ప్రజల కు కచ్చితంగా కుటుంబ సభ్యులకు చిన్నపిల్లలు బైకులను నడిపేందుకు బైక్ వారి చేతికిఇచ్చిన తల్లిదండ్రుల మీదనే చర్యలు తీసుకోబడును అని కాస్త గట్టిగా చెప్పడం కూడా జరగాలి ఈమధ్య కాలంలో తిరుపతి విశాఖపట్నంలలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించి స్పోర్ట్స్ బైక్ లను మరియు అధిక శబ్దంతో స్పీడ్ గా రైట్ చేస్తున్న బైక్ లను సీసీటీవీ ల ద్వారా గుర్తించి వారి బండ్లను స్వాధీనం చేసుకొని వారి బైక్‌లలో అధిక శబ్దం చేసే లేటెస్ట్ సైలెన్సర్లను తొలగించడం మరియు బైక్ లో విచిత్రమైన స్టిక్కరింగ్ లను తొలగించడం వంటి ప్రత్యేక చర్యలు తీసుకొంటే అలాంటి కార్యక్రమాలు మన సూళ్లూరుపేటలో చేపట్టాలి ఎందుకంటే గత ఐదు సంవత్సరాలలో సూళ్లూరుపేట పరిసరాల లో అత్యధికంగా పరిశ్ర మలు ఏర్పడడం వల్ల ప్రతి ఇంటిలో మూడు బైకులు నాలుగు బైకులు ఉంటు న్నాయి వీటిని ఐదు ఆరు తరగతులు చదువుతున్న పిల్లలు కూడా బైక్ రైడ్ చేసుకొని రోడ్ల మీదకు వచ్చేస్తున్నారు అటువంటి వాహనాలను పట్టుకొని వారి తల్లిదండ్రులకు అవగాహన కార్యక్రమం తో పాటు జరిమానాలు విధించడం వంటివి కూడా జరుగుతాయని వారికి చెప్పడం జరగాలి ఈ కార్యక్రమాలన్నీ సూళ్లూ రుపేట పరిసరాల్లోని కాలేజీలలో నిర్వహిస్తే కొంతలో కొంత ప్రమాదాలు తగ్గే అవకాశం ఉందని పై విషయాలను పోస్టర్ల ద్వారా పట్టణంలో ప్రచారం చేయడం కూడా కొంతలో కొంత ప్రమాదాలు తగ్గేందు కు అవకాశాలు ఉన్నాయ ని … ముఖ్యంగా డ్రంక్ అండ్ డ్రైవ్ పైన అధిక జరిమానాలు వేసి అలా డ్రైవ్ చేసిన వారి బండ్లను కూడా కొంతకాలం పోలీసు వారి ఆధీనంలో ఉండేలా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు

