
పయనించే సూర్యుడు ఆగస్ట్ 16 (సూళ్లూరుపేట మండలం రిపోర్టర్, దాసు) :
డ్డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ గురుకులం సూళ్లూరుపేట స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా, కెనరా బ్యాంక్ సూళ్లూరుపేట శాఖ CSR కార్యక్రమం కింద డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల సూళ్లూరుపేట నందు 5వ తరగతి నుండి 10వ తరగతి వరకు చదివే 6 మంది ప్రతిభావంతులైన SC/ST విద్యార్థులను ఎంపిక చేసింది. వీరికి స్కాలర్‌షిప్‌లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సూళ్లూరుపేట శాఖాధిపతి కరుణానిధి మరియు శివప్రసాద్ పాల్గొని దేశ అభివృద్ధిలో కెనరా బ్యాంక్ పాత్రను వివరించారు.