
పయనించే సూర్యుడు మే1 శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి
యాడికి మండల పరిధిలోని చందన గ్రామంలో 139వ మేడే కార్మిక దినోత్సవ వేడుకలను గురువారం సిపిఐ నాయకులు ఘనంగా నిర్వహించారు. సిపిఐ సీనియర్ నాయకులు నీలూరు లక్ష్మయ్య చేతుల మీదుగా జెండాను ఆవిష్కరించారు, ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు వెంకటరాముడు యాదవ్, యాడికి సిపిఐ మండల కార్యదర్శి జూటూరు మొహమ్మద్ రఫీ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై సంఘటిత అసంఘటిత రంగా కార్మికులు పోరాటానికి సంసిద్ధం కావాలన్నారు.44 లేబర్ కోడ్ కార్మిక చట్టాలను కేంద్ర ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్ చట్టాలుగా తీసుకురావడం దుర్మార్గమైన చర్య అన్నారు. సుప్రీంకోర్టు తీర్పు మేరకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల సహాయ కార్యదర్శి వడ్డే రాముడు సిపిఐ, యువ నాయకులు జూటూరు మహబూబ్ రబ్బాని చందన బిసి రంగప్ప సూరప్ప, ప్రజానాట్యమండలి నరసయ్య, వెంకటేశు ఏపీ పౌర హక్కుల సంఘం నేత ఆదినారాయణ, ఏపీ ప్రగతిశీల కార్మిక సంఘం నేత చెన్నకేశవుడు, తదితరులు పాల్గొన్నారు
