
పయనించే సూర్యుడు న్యూస్ ఏప్రిల్ 25(శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి) అనంతపురం జిల్లా యాడికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని జిల్లా మలేరియా అధికారి డి ఓబులు వారి ఆదేశాల ప్రకారం డాక్టర్ పరమేశ్వర ఆధ్వర్యంలో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా తాడిపత్రి మలేరియా సబ్ యూనిట్ ఆఫీసర్ శ్రీనివాసులు ప్రాథమిక ఆరోగ్య సిబ్బంది చేత ప్రతిజ్ఞ చేయించి అలాగే యాడికి పట్టణమునందు ర్యాలీ నిర్వహించడం జరిగినది పట్టణ ప్రజలకు మలేరియా నిర్మూలించుటకు ప్రజలకు ర్యాలీ ద్వారా అవగాహన కల్పించడం జరిగినది. దోమ కుట్టకూడదు దోమ పుట్టకూడదు ఆరోగ్యశాఖ పంతం దోమ అంతం పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం దోమతెర వాడడం ద్వారా మలేరియా జ్వరం రాకుండా ప్రజలకు అవగాహన కల్పించడం జరిగినది ఈ ర్యాలీ నందు మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పరమేశ్వర్ తాడిపత్రి మలేరియా సబ్ యూనిట్ ఆఫీసర్ శ్రీనివాసులు, సి.హెచ్.ఓ జుబేదా, మేల్ సూపర్వైజర్ రాంప్రసాద్ గౌడ్, ఎల్ డి కంప్యూటర్ సరితా దేవి,ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.