
పయనించే సూర్యుడు న్యూస్ సెప్టెంబర్ 2(శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి)
మండల కేంద్రమైన యాడికిలో మంగళవారం ఎం.పీ.డీ.వో. మీటింగ్ హాల్ నందు తాడిపత్రి శాసనసభ్యులు జె.సి. అస్మిత్ రెడ్డి అన్ని శాఖల మండల అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించినారు. శాసనసభ్యులు జె.సి. అస్మిత్ రెడ్డి మాట్లాడుతూ పంచాయతీకి సంబంధించిన ఆదాయం గురించి పంచాయతీ ఇన్చార్జ్ ఈ.వో. శశికళలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా నేను యాడికి గ్రామ ప్రజలకు త్రాగునీటి సమస్య లేకుండా చేయడమే నా మొదటి లక్ష్యం అని ఆయన తెలిపారు. ఎక్కడైనా మంచినీటి సమస్య ఉంటే నా దృష్టికి తీసుకురావాలని అధికారులను కోరారు. డ్రైవేజీ సమస్యపై ప్రజలు నాకు వ్యక్తిగతంగా కలిసి చెత్తను తీసుకుపోయే రిక్షాలు వీధులలో వారాలు, వారాలు గడిచిన చెత్తను తీసుకువెళ్లే రిక్షాలు రావడంలేదని కొంతమంది ప్రజలు నాకు వ్యక్తిగతంగా చెప్పారు. అని ఆయన తెలిపారు. చాలా వీధులలో వీధిలైట్లు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని త్వరలోనే సొంత నిధులతో వీధులలో వీధిలైట్లు ఏర్పాటు చేస్తానని తెలిపారు. కోన రోడ్డులో చౌడేశ్వరి దేవాలయం ఎదురుగా డ్రైనేజీ సమస్య చాలా విపరీతంగా ఉందని దానిని అధికారులు ఒక ప్రణాళిక వేసి విధివిధానాలు రూపొందించాలని అధికారులకు కోరారు. తాడిపత్రి పట్టణాన్ని ఎలాగైతే అభివృద్ధి చేశామో యాడికి ని అలా చేయడమే తమ లక్ష్యం అని తెలిపారు. అన్ని శాఖల అధికారులు ఒక ప్రణాళిక ప్రకారం ముందుకెళ్లాలని కోరారు. ప్రతి ఒక శాఖకు సంబంధించిన అధికారులను మీకు ఏమైనా సమస్యలు ఉంటే నా దృష్టికి తీసుకురండి తక్షణమే పరిష్కరిస్తానని శాసనసభ్యులు జె.సి. అష్మిత్ రెడ్డి అన్ని శాఖల అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో అన్ని శాఖలకు సంబంధించిన మండల అధికారులు, పోలీసు సిబ్బంది, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు .
