
పయనించే సూర్యుడు న్యూస్ అక్టోబర్ 11(శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి)
జిల్లా మలేరియా అధికారి ఓబుల్ ఆదేశాలు ప్రకారం తాడిపత్రి మలేరియా సబ్ యూనిట్ ఆఫీసర్ శ్రీనివాసులు ఈరోజు యాడికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం యాడికి మూడవ సచివాలయం నందు ఇంటి ఇంటికి వెళ్లి ఫీవర్ సర్వే తనకి చేయడం జరిగింది అలాగే వార్డు నందు ఫ్రైడే డ్రై డే కార్యక్రమం నిర్వహించి తొట్లనందుగల లార్వాను తొలగించడం జరిగినది ఫ్రైడే గురించి వివరించింది ప్రతి శుక్రవారం నీటితోట్లను శుభ్రముగా కడుక్కొని ఒక గంట ఆరబెట్టిన తర్వాత నీరు నింపుకొన్న వాళ్ళని తెలియజేయడం జరిగి నది అలాగే తాగి పడేసిన టెంకాయ బోండాలను తాగి పడేసిన నీటి కప్పులు టీ కప్పులు నందును మరియు పాత టైర్ల నందును నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని తెలియజేయడం జరిగింది ఇంటి ఆవరణంలోని పూల కుండీలను ఇంటి లోపల కూలర్లు నందును మరియు రెఫ్రిజిరేటర్ వెనక భాగముల గల బాక్స్ నందును ఎక్కువ నీరు నిలవకుండా చూసుకొని తెలియజేయడం జరిగినది అలాగే వార్డుల నందు జ్వరం వచ్చిన ప్రతి ఒక్కరికి రక్త పూతలు తీయవలెనని ఏ.ఎన్.ఎం. సుమంగలకు తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో తాడిపత్రి మలేరియా సబ్ యూనిట్ ఆఫీసర్ శ్రీనివాసులు సి.హెచ్. ఓ.జుబేదా ఎం.పి.హెచ్ ఏ రాంప్రసాద్ గౌడ్, శోభకుమారి, ఏ.ఎన్.ఎం.సుమంగళ ఆశా కార్యకర్తలు లక్ష్మీ, నీలావతి, సారమ్మ సువార్తమ్మ, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
