
పయనించే సూర్యుడు ఫిబ్రవరి 17 షాద్నగర్ నియోజకవర్గం ఇన్చార్జి మెగావత్ నరేందర్ నాయక్ ) షాద్నగర్ స్థానిక ఇండియన్ హై స్కూల్ లో జరిగిన ఆల్ కలర్ బెల్ట్ కరాటే గ్రేడింగ్ టెస్టు ను యాదవ్ బుడోఖాన్ కరాటే క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ టెస్ట్ లో దాదాపు 100 మంది విద్యార్థులు పాల్గొని తమ ఉత్తమ ప్రతిభ కనబరిచి బెల్టులు మరియు సర్టిఫికెట్లు అందుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న షాద్నగర్ ట్రాఫిక్ సిఐ చంద్రశేఖర్ పాల్గొని విద్యార్థులకు బెల్టులు మరియు సర్టిఫికెట్లు అందించడం జరిగింది ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ విద్యార్థులు ప్రతి ఒక్కరూ కరాటే శిక్షణ తీసుకోవాలని దీనితో మానసిక శారీరక శ్రమ కలిగి విద్యార్థులు దృఢంగా ఉంటారని మరియు క్రమశిక్షణ కలిగి ఉంటారని అన్నారు ఈ కార్యక్రమంలో ఇండియన్ హైట్ స్కూల్ చైర్మన్ మహేశ్వర్ స్కూల్ ప్రిన్సిపాల్ నవీన్ మరియు బుడోఖాన్ కరాటే క్లబ్ డిప్యూటీ గ్రాండ్ మాస్టర్ సాయినాథ్ యాదవ్ సీనియర్ మాస్టర్ ఉత్తేజ్ పిరు వినయ్ సురేష్ తదితరులు పాల్గొన్నారు