
( పయనించే సూర్యుడు మే 07 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్)
షాద్నగర్ నియోజకవర్గం ఫరూక్నగర్ మండలంలోని బూర్గులలో జరుగుతున్న ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ లో కడియాల కుంట తండాకు చెందిన క్రికెట్ టీం రెండో రౌండ్ కు చేరుకున్న సందర్భంగా తండకు చెందిన క్రీడాకారులను కడియాల కుంట తండా మాజీ సర్పంచ్ బుజ్జి రాజు నాయక్ క్రీడాకారులకు జెర్సీలు అందించడం ( స్పాన్సర్ ) చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువకులు క్రీడల్లో ఉన్నత స్థాయికి ఎదగాలని క్రీడల ద్వారా మానసికంగా మరియు శారీరకంగా దృఢంగా తయారవుతారని అన్నారు. తన సహాయం క్రీడాకారులకు ఇప్పటికీ ఉంటుందని ఆయన భరోసాన్నిచ్చారు. ఈ కార్యక్రమంలో సేవాలాల్ యూత్ అధ్యక్షులు శ్రీను నాయక్ మరియు మాజీ వార్డ్ సభ్యులు పిర్యా నాయక్ , రెడ్యా నాయక్ మరియు రాత్లావత్ రమేష్ మరియు తాండకు చెందిన క్రీడాకారులు మరియు టోర్నమెంట్ నిర్వాహకులు పాల్గొన్నారు.
