దుద్దిల్ల శ్రీను బాబు
పయనించే సూర్యుడు జనవరి 10 మంథని నియోజకవర్గం రామగిరి మండలంలోని రాణి రుద్రమదేవి స్టేడియంలో రామగిరి మండల కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ శాసనసభావతి స్వర్గీయ శ్రీపాద రావు స్మారకార్థం మంథని డివిజన్ స్థాయి టికెట్ టోర్నమెంట్ ను గురువారం దుద్దిల్ల శ్రీను బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత చదువుతోపాటు క్రీడ ల్లోనూ రాణించాలని దుద్దిళ్ల శ్రీను బాబు అన్నారు.క్రీడాకారులను పరిచయం చేసుకుని వారిని ఉద్దేశించి మాట్లాడారు.యువత చెడు వ్యసనాల బారిన పడకుండా శారీరక ధృడత్వం, మానసికోల్లాసం కలిగించే క్రీడల్లో పాల్గొనాలన్నారు.
క్రీడా స్ఫూర్తిని ప్రదర్శిస్తూ పోటీలను విజయవంతం చేయాలన్నారు.