
వెంకటేశ్వర వాషింగ్ సెంటర్ ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్
( పయనించే సూర్యుడు మార్చి 8 షాద్నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ )
షాద్ నగర్ పట్టణం మహబూబ్నగర్ రోడ్డు నందు బీఆర్ఎస్ నాయకులు వెంకట్ నాయక్ నూతనంగా ఏర్పాటు చేసిన వెంకటేశ్వర వాషింగ్ సెంటర్ ని మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ గారు ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ… నేటి ఆధునికయుగంలో యువత అందుబాటులో ఉన్న స్వయం ఉపాధి రంగాల వైపు ఆసక్తి కనబర్చడం హర్షణీయమన్నారు. పట్టుదల, కృషితో ఆలోచనలను ఆచరణలో పెట్టెవారు సాదించలేనిది ఏది లేదన్నారు. వాషింగ్ సెంటర్ నిర్వాహకులు వెంకట్ నాయక్ కి శుభాశీస్సులు అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ నరేందర్, మాజీ వైస్ చైర్మన్ నటరాజ్, మాజీ కౌన్సిలర్ ఈశ్వర్ రాజు, నాయకులు జూపల్లి శంకర్, చీపిరి రవి యాదవ్, భువనేశ్వర్ రెడ్డి, రాఘవేందర్, గుండు అశోక్, రఘు, నవీన్ దుమ్మని, వెంకటేష్ గుప్తా, రాజేష్ నాయక్, సాయితేజ, శివ నాయక్ తదితరులు పాల్గొన్నారు.