
సామాజిక కార్యకర్తలు మణికంఠ నరేష్ బాబు గవర్నర్ కు వినతి పత్రం
పయనించే సూర్యుడు సెప్టెంబర్ 14(హైదరాబాద్ మాధవరెడ్డి)
రాష్ట్రంలో యూరియా కొరత కారణంగా రైతులు క్యూలలో నిలబడటం, అధిక ధరలకు విక్రయాలు జరగడం,వర్షాకాలంలో పంటలు దెబ్బతినడం వంటి సమస్యలపై తక్షణ చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ మరియు ముఖ్యమంత్రికి సామాజిక కార్యకర్తలు మణికంఠ నరేష్ బాబు వినతిపత్రం సమర్పించారు.రాష్ట్రవ్యాప్తంగా యూరియా సరఫరా సమృద్ధిగా జరగాలని, అధిక ధరల విక్రయాలను అరికట్టాలని, పంట నష్టాలకు పరిహారం ప్రకటించాలని, రైతులకు ఉచిత విత్తనాలు, ఎరువులు మరియు సబ్సిడీలు అందించాలని డిమాండ్ చేశారు.