
{సూర్యుడు సెప్టెంబర్ 1 రాజేష్}
రాయపోల్ మండల్ కేంద్రం పరిధిలో గంటల తరబడి వేచి ఉన్న రైతులతో మాత్రం యూరియా కష్టాలు తప్పడం లేదు. తిండి తిప్పలు మానేసి షాపుల వద్ద క్యూలైన్లో నిలబడి ఉన్న ఒరియా ఇవ్వకపోవడంతో రైతన్నలు రోడ్డుపై బైఠాయించి గంటపాటు ధర్నా నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాస్తారోకో నిర్వహించి నిరాశన తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ వ్యవసాయ శాఖ అధికారులపై అన్నదాతలో అగ్రహం వ్యక్తం చేశారు. నాలుగు రోజులు గడుస్తున్న యూరియా అందించడంలో అధికారులు విఫలం చెందారని వివిధ గ్రామాలకు చెందిన రైతులు ఆరోపించారు. ఇందులో స్థానిక ఎస్సై మానస పోలీస్ బృందంతో అక్కడికి చేరుకోవడం అందరూ విరమించాలని యూరియా అందించేందుకు తాను కృషి చేస్తానని మంగళవారం ఉదయం రైతులందరికీ యూరియా సరఫరా అందే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. కాగా రైతులు చేపట్టిన ధర్నాకు అభిమానులకి టిఆర్ఎస్ రాష్ట్ర యువజన నాయకులు రాజిరెడ్డి ఇప్ప దయాకర్ మండల నాయకులు పరశురాములు వివిధ గ్రామాల చెందిన రైతులు పాల్గొన్నారు
