
పయనించే సూర్యుడు ఆగష్టు 21(పొనకంటి ఉపేందర్ రావు )
టేకులపల్లి, మండ లంలోని కోయగూడెం, టేకులపల్లి లోని ఎరువుల షాపులను గురువారం ఇల్లందు ఏడిఏ జి. లాల్ చంద్, ఏ.ఎం.ఓ ఎన్ .అన్నపూర్ణ, తనీఖీ చేయడం జరిగినది. అనంతరం ఎరువుల డీలర్లకు సమావేశం నిర్వహించి మాట్లాడుతూ. యూరియా నిలువ చేసి ఎక్కువ రేటుకు విక్రయిస్తే చర్యలు తీసుకుంటా మని హెచ్చరించడం జరిగింది, ఇక నుండి ప్రైవేట్ డీలర్లకు యూరియా వస్తే ఆ స్టాకును సంబంధిత వ్యవసాయ అధికారులు కూపన్లు జారిచేసి విక్రంచడం జరు గుతుంది.డీలర్లకు యూరియా స్టాక్ రాగానే వ్యవసాయ అధికారులకు తెలియుజేయాలని తెలియజేశారు. డీలర్లు నానో యూరియా, డిఏపి పైన రైతులకు అవగాహన కల్పించాలిని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో.వ్యవసాయ అధికారులు డీలర్లు పాల్గొన్నారు.