ఇప్పటివరకు డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా మృతి చెందిన వారి కుటుంబాలు మరియు ఆదివాసి ప్రజలు తరలిరావాలి కుంజ శ్రీను పిలుపు.
పయనించే సూర్యుడు రీపోట్టర్ జల్లి నరేష్ డివిజన్ ఇంచార్జి అక్టోబర్ 28
రంపచోడవరం మండలం నరసాపురం గ్రామానికి చెందిన బాపనమ్మ మరియు ఆమె బిడ్డ మృతికి కారుకులైనటువంటి రంపచోడవరం ఏరియా ఆసుపత్రి డాక్టర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదివాసి సంక్షేమ పరిషత్ మరియు బాపనమ్మ భర్త కొట్టం రాజన్న దొర ఆధ్వర్యంలో జాతీయ షెడ్యూల్ తెగల కమిషన్ కు, జాతీయ మానవ హక్కుల కమిషన్ కు, మరియు జాతీయ మహిళా కమిషన్ న్యూఢిల్లీ వారికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆదివాసి సంక్షేమ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజా శ్రీను మాట్లాడుతూ రంపచోడవరం ఏరియా ఆసుపత్రిలో సిబ్బంది, డాక్టర్ల నిర్లక్ష్యం వలనే మాత శిశు మరణాలు వరుసగా సంభవిస్తున్నాయని, ఈ నిర్లక్ష్యంపై డాక్టర్లు తప్పిదంపై అలాగే బాపనమ్మ మృతికి కారుకులైన డాక్టర్లను వైద్యాధికారులను శిక్షించే వరకు ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని. ఇప్పటివరకు ఐటీడీఏ అధికారుల నుండి జిల్లా కలెక్టర్ కు రాష్ట్రస్థాయి అధికారులకు మరియు జాతీయస్థాయిలో ఎస్టీ, మహిళ, హ్యూమన్ రైట్స్ కమిషన్ లకు ఫిర్యాదు చేయడం జరిగిందని. గత శుక్రవారం నాడు శాంతియుత నిరసన తోటి రంపచోడవరం ఐటిడిఏ ప్రాజెక్టు అధికారికి వారికి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసి బాపనమ్మ మరియు తనకు పుట్టిన బిడ్డ మరణానికి కారణాలను వివరించడం జరిగిందని ఆ సమయంలో కొంత సమయం ఇస్తే విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని ప్రాజెక్టు అధికారి తెలియజేసి ఉన్నారని, అలాగే రంపచోడవరం పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేయడం జరిగిందని పోలీస్ అధికారులు కూడా ప్రాజెక్టు అధికారి వారి నివేదికను ఆధారంగా చర్యలు తీసుకుంటామని తెలియజేసీ ఉన్నారని కావున సంబంధిత అధికారులు వేగవంతంగా విచారణ పూర్తి చేసి సంబంధిత డాక్టర్లపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. తుఫాను ప్రభావం తగ్గిన వెంటనే ఇప్పటివరకు రంపచోడవరం ఆసుపత్రి డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా మృతిచెందిన వారి కుటుంబాలతొ, ప్రజల సహకారంతో కలిసొచ్చే ఆదివాసి సంఘాలు రాజకీయ పార్టీలు అందరితో కలిసి రంపచోడవరం ఏరియా ఆసుపత్రి ముట్టడి కార్యక్రమం చేయబోతున్నట్లు ఆయన తెలియజేశారు. చాలాచోట్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు ప్రజల ప్రాణాలు కాపాడటంలో, సురక్షితమైన ప్రసవాలు చేయటంలో రికార్డులు సృష్టిస్తావుంటే, రంపచోడవరం ఏరియా ఆసుపత్రి మాత్రం ప్రజల్ని చంపడంలో రికార్డు సృష్టిస్తుందని ఆయన ఆవేదన వ్యక్తపరిచారు. రంపచోడవరం ఏరియా ఆసుపత్రిలో పనిచేస్తున్న డాక్టర్లు రాజమండ్రి మొదలైన ప్రాంతాల నుండి ప్రతిరోజు అప్ అండ్ డౌన్ చేస్తూ సకాలంలో ఆసుపత్రి కి రావడం లేదని, ఎమర్జెన్సీ పరిస్థితిలో, ప్రసవ సమయంలో ఆస్పత్రిలో పనిచేసే వర్కర్లు డ్యూటీ టైం లో ఉండే నర్సులే డాక్టర్లుగా పాత్ర పోషిస్తున్నారని. డాక్టర్లు మాత్రం ఉదయం 11, 12 గంటలకు హాస్పిటల్ కి వచ్చి సాయంత్రం మూడు నాలుగు గంటలకే ఇళ్లకు వెళ్లిపోతున్నారని ఆయన మండిపడ్డారు. సరిగ్గా డ్యూటీ చేయని డాక్టర్లకు జీతాలు ఎందుకు సరిగ్గా ఇవ్వాలని ఆయన ఈ సందర్భంగా ప్రశ్నించారు. డాక్టర్ల వృత్తికి ఉన్న మర్యాదను రంపచోడవరం ఏరియా ఆసుపత్రిలోని డాక్టర్లు నీరుగారుస్తున్నారు అని ఆయన ఆరోపించారు. ఏజెన్సీలో ఆదివాసి ప్రజలను వైద్యం కోసం వస్తే రంపచోడవరం ఏరియా ఆసుపత్రి డాక్టర్లు అంటరాని వారిగా చూస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తపరిచారు. సరిగ్గా డ్యూటీ చేసే వైద్యులు మాత్రమే ఆసుపత్రిలో ఉంచాలని చుట్టం చూపుగా వచ్చిపోతూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడే వైద్యులను తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. త్వరలో జరగబోయే ఆసుపత్రి ముట్టడి ప్రజల ప్రయోజనం కోసమేనని ఆయన అన్నారు. ఎన్ని మరణాలు సంభవించిన ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రజలు నోరు విప్పరనే అలుసు తోటి ఇక్కడ డాక్టర్లు మరియు అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని కావున ఇప్పటివరకు ఏరియా ఆసుపత్రి డాక్టర్లు నిర్లక్ష్యం వలన తమ కుటుంబ సభ్యులను కోల్పోయిన బాధితులు, ఆదివాసి ప్రజలు, ఆదివాసి సంఘాలు రాజకీయ పార్టీలు కలిసొచ్చి ముట్టడిని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఆదివాసి సంక్షేమ పరిషత్ డివిజన అధ్యక్షులు మోడీద నూకరాజు, డివిజన్ కోఆర్డినేటర్ పీఠా ప్రసాద్, బాపనమ్మ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

