పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ అక్టోబర్ 28
రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేస్తున్న జిల్లాలలో రంపచోడవరం కేంద్రంగా ఏజెన్సీ జిల్లాను ఏర్పాటు చేయాలని గిరిజన సంఘం జిల్లా నాయకులు సీసం సురేష్ డిమాండ్ చేశారు మంగళవారం నాడు చింతూరు మండల ముఖ్య కార్యకర్తల సమావేశంలో సిసం సురేష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా జిల్లాలు ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించిందని రంపచోడవరం చింతూరు పోలవరం ఏజెన్సీ మండలాలైన 14 మండలాల ప్రాంతాలను కలుపుతూ ఏజెన్సీ జిల్లాను ఏర్పాటు చేయాలని అన్నారు, గత ఎన్నికల సందర్భంలో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రంపచోడవరం ఏజెన్సీ ప్రజలకు జిల్లా ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇవ్వడం జరిగిందని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ ప్రాంత ప్రజల సమస్యలను దృష్టిలో పెట్టుకుని ఏజెన్సీ ప్రాంత ఆదివాసీలకు హక్కులు పటిష్టంగా అమలు జరగాలంటే రంపచోడవరం కేంద్రంగా జిల్లా ఏర్పాటుతోనే సాధ్యమవుతుందని ప్రభుత్వం జిల్లా ఏర్పాటుకు కృషి చేయాలని ఈ సందర్భంగా కోరారు, కోరారు ఈ సమావేశంలో చింతూరు మండల కార్యదర్శి ముట్టం రాజయ్య, తుమ్మల ఎంపిటిసి, వ్యాక రాజ్ కుమార్, గిరిజన సంఘం నాయకులు సోడే సాయి, లక్ష్మణ్, నాగార్జున్, మడివి, రామారావు తదితరులు పాల్గొన్నారు.

