
పయనించే సూర్యుడు రీపోట్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జి నవంబర్- 1 :
పోలవరం నిర్వాసితులు, గిరిజనప్రాంత ప్రజల ప్రయోజనార్థం, ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రంపచోడవరం కేంద్రంగా ప్రత్యేక గిరిజన జిల్లాను ఏర్పాటు చేయాలని సిపిఎం పార్టీ జిల్లా కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. శనివారం నాడు చింతూరు సిపిఎం పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి బొప్పెన కిరణ్ మాట్లాడుతూ చింతూరు డివిజన్, రంపచోడవరం డివిజన్, పోలవరం డివిజన్లను కలుపుకొని రంపచోడవరం కేంద్రంగా గిరిజన జిల్లాను ఏర్పాటు చేస్తానని గత ఎన్నికల్లో ప్రభుత్వం హామీ ఇచ్చిందని ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఈ ప్రాంతాన్ని తీసుకువెళ్లి తూర్పుగోదావరిలో కలిపి ఆలోచన దుర్మార్గమని అన్నారు. ఏజెన్సీ ప్రాంత హక్కులు చట్టాలు ఇప్పటికే కాల రాయబడుతున్నాయని, మరలా ఈ ప్రాంతాన్ని అల్లూరి నుండి విడదీసి తూర్పుగోదావరి జిల్లాలో కలపాలని మంత్రుల బృందం చర్చించడం దుర్మార్గమని అన్నారు. ప్రత్యేక జిల్లా ఏర్పాటు ద్వారానే గిరిజన ప్రాంత ప్రజల సమస్యలు పరిష్కారం అవుతాయని, పోలవరం నిర్వాసితుల సమస్యలు పరిష్కారం అవుతాయని, ఆదివాసీల అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచన చేసి ఎన్నికల్లో ఈ ప్రాంత ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు రంపచోడవరం చింతూరు పోలవరం డివిజన్లను మరియు సబ్ ప్లాన్ లోని గిరిజన గ్రామాలను కలుపుకొని రంపచోడవరం కేంద్రంగా ప్రత్యేక గిరిజన జిల్లాను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో అందరినీ కలుపుకొని జిల్లా ఏర్పాటు కోసం ప్రజా ఉద్యమం చేపడతామని అన్నారు. సమావేశంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మర్లపాటి నాగేశ్వరరావు, పల్లపు వెంకట్, జిల్లా కమిటీ సభ్యులు మేకల నాగేశ్వరరావు, సీసం సురేష్, పులి సంతోష్,ఐ వి, పాయం సీతారామయ్య,మడకం నాగమణి, యర్రంశెట్టి శ్రీనివాస్, మడకం చిన్నయ్య, పొడియం లక్ష్మన్,మల్లం సుబ్బమ్మ, చింతా రాంబాబు, సవలం కన్నయ్య, పట్రా రమేష్, కారం సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.