పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ అక్టోబర్ 1
రంపచోడవరం ఎమ్మెల్యే శ్రీమతి శిరీష దేవి మఠం విజయభాస్కర్ నియోజకవర్గంలోని ఆరు మండలాల అధ్యక్షుల పేర్లను ప్రకటించి వారి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఎమ్మెల్యే గారి ఇంటి వద్ద జరిగిన కార్యక్రమానికి, ఆరు మండలాల అధ్యక్షులను ఆహ్వానించి, వారికి శాలువాలు కప్పి పూల మాలలు వేసి, పార్టీ కండువా కప్పి, ప్రమాణ స్వీకారం చేయించారు. చింతూరు మండల అధ్యక్షులుగా ఎండి జమాల్ ఖాన్ పేరు అధికారికంగా ప్రకటించారు. పార్టీ కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు మండల అధ్యక్షుల పేర్లను అధికారికంగా ప్రకటించారు. పార్టీ అధ్యక్షులుగా అందరు పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని, స్థానిక సంస్థల ఎన్నికల్లో అధిక పంచాయతీలు గెలుచుకునేలా కృషి చేయాలని, పార్టీ కార్యక్రమాలను వేగవంతం చేయాలని ఎమ్మెల్యే శిరీష దేవిగారు, మఠం విజయభాస్కర్ గారు ఆరుగురు మండల అధ్యక్షులకు కోరారు. మిగిలిన 5 మండల అధ్యక్షులు కూడా త్వరలోనే ప్రకటిస్తామని వారు పేర్కొన్నారు.

