ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జేఏసీ డిమాండ్
పయనించే సూర్యుడు రీపోట్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ అక్టోబర్ 28 అల్లూరి సీతారామరాజు జిల్లా,
చింతూరులో ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జేఏసీ డివిజన్ సమావేశ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశాన్ని ఉద్దేశించి చింతూరు డివిజన్ జేఏసీ చైర్మన్ జల్లి నరేష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కొత్త జిల్లాల ప్రకటన లో రంపచోడవరం, చింతూరు, పోలవరం ఏజెన్సీ ప్రాంతాలను కలుపుకొని రంపచోడవరం కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయడం వల్ల ఈ ప్రాంతానికి పరిపాలన సౌలభ్యం చేరువ ఔతుందని, మొత్తం కూడా ఏజెన్సీ ప్రాంతం కాబట్టి స్థానిక ఆదివాసీలకు న్యాయంజరుగుతుంది అన్నారు, కాబట్టి నాడు ప్రతి పక్షం నాయకుడిగా ఉన్నపుడు విలీన మండలకు వరద బాధితులను పరామర్శించడానికి వచ్చినప్పుడు విలీన మండల ప్రజలకు ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేసి అభివృద్ధి చేస్తానని ఇచ్చిన హామీని ప్రస్తుత ముఖ్యమంత్రి నారాచంద్రబాబునాయుడు గారు ఇప్పుడు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. రంపచోడవరం ఐటీడీఏ లోని ఎనిమిది మండలాలు చింతూరు ఐటీడీఏ లోని నాలుగు విలీన మండలలు అలాగే పోలవరం నియోజకవర్గ కొట రామచంద్రపురం ఐటీడీఏ ప్రాంతాన్ని కలుపు కొని రంపచోడవరం కేంద్రంగా, కారం తమ్మన దొరపేరు పేరు తో మరో ప్రత్యేక ఏజెన్సీ జిల్లా ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. లేని పక్షం లో ఆదివాసీ ఉద్యమం తీవ్రతారం చేస్తామని అయన ప్రభుత్వనీ హెచ్చరించారు . ఈ సమావేశంలోఆదివాసీ జేఏసీ వైస్ చైర్మన్ ,కారం.సాయి బాబు,మండల చైర్మన్.పొడియం.రామకృష్ణ కాకా.సీతరామయ్య,డివిజన్ సభ్యులకు మడివి.రాజు.చదలవడా సర్పంచ్ కుంజా.తిరుపతి రావు,కలముల.ముత్తయ్య,కులుమల రామయ్య,సుభయ్య,నాగయ్య మడకం.రాజమ్మ, తదితరులు పాల్గొన్నారు

