
జహీరాబాద్ ఎంపీ సురేష్ షట్కార్
పయని0చే సూర్యుడు సెప్టెంబర్ 27 పెద్ద శంకరంపేట మండలం మెదక్ జిల్లా( రిపోర్టర్ జిల్లా అశోక్ )
విశ్వంభరా న్యూస్ పెద్ద శంకరంపేట. రజకులను ఎస్సీ కేటగిరీలో చేర్చాలని పార్లమెంటులో మాట్లాడానాని కేంద్ర ప్రభుత్వం దృష్టికి సైతం తీసుకు వెళ్లడం జరిగిందని జహీరాబాద్ ఎంపీ సురేష్ షెత్కర్ అన్నారు. శుక్రవారం పెద్ద శంకరంపేటలో చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. దేశంలో 17 రాష్ట్రాల్లో రజకులు ఎస్సీ కేటగిరిలో కొనసాగుతున్నారని 11 రాష్ట్రాల్లో మాత్రం వారికి బీసీలు కేటగిరీలుగా కొనసాగుతున్నారని వారికి అన్యాయం జరుగుతుందని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లడం జరిగింది అన్నారు.రైతులందరూ ఐక్యమత్యంగా ఉండాలని ఆర్థికంగా సామాజికంగా ఎదగాలన్నారు. ఈ కార్యక్రమంలో విగ్రహ దాతలు రామచంద్ర చారి వేణుగోపాల చారి మురళి పంతులు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు రాయిని మధు నారా గౌడ్ రాజేందర్ గౌడ్ జనార్ధన్ పెరుమాళ్ గౌడ్ పున్నయ్య ఆర్ ఎన్ సంతోష్ కుమార్ రజక సంఘం బాధ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.