Thursday, January 16, 2025
Homeతెలంగాణరజకులను కించపరిచేలా మాట్లాడిన చిట్టిబాబును అరెస్టు చేయాలి

రజకులను కించపరిచేలా మాట్లాడిన చిట్టిబాబును అరెస్టు చేయాలి

Listen to this article

పయనించే సూర్యుడు జనవరి 11-01-2025 కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం

రజక సంఘం ఆద్వర్యంలో మొగిలిపాలెం గ్రామంలో చిట్టిబాబు దిష్టి బొమ్మ దగ్ధం 24/7 టీవీ డిబేట్లో రజకులను హేళన చేసే విధంగా చులకన భావంతో మాట్లాడిన సినీ రాజకీయ విశ్లేషకుడు త్రిపురనేని చిట్టిబాబు దిష్టిబొమ్మను రజక సంఘం అధ్యక్షుడు కాల్వ మధుబాబు ఆధ్వర్యంలో మొగిలిపాలెం లో దగ్ధం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రజకులను కించపరిచేలా టీవీ డిబేట్లో మాట్లాడిన చిట్టిబాబును వెంటనే అరెస్టు చేయాలని రజక జాతికి చిట్టిబాబు వెంటనే భహిరంగ క్షమాపణ చెప్పాలని, అలగే 24/7 న్యూస్ చానెల్ కూడా దీనికి భాద్యత వహించి వారి చానెల్లో చిట్టి బాబుతో క్షమాపణలు చెప్పించాలని లేనిపక్షంలో రాష్ట్రస్థాయిలో నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని అవసరమైతే చిట్టిబాబు పై భౌతిక దాడులు చేసేందుకు కూడా వెనకాడేది లేదని వారు హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో అధ్యక్షులు దుడ్డేల రాజయ్య
ఉపాధ్యక్షులు తడిగొప్పులశ్రావణ్,
ప్రధాన కార్యదర్శి మైలారం శ్రీనివాస్,కార్యదర్శి పోగుల మల్లేష్,కోశాధికారి,దుడ్డేల రమేష్ రజక సంఘం సభ్యులు,దుడ్డేలా రాయమల్లు,దుడ్డేలా రాయమల్లు,మైలారం కుమారస్వామి,కలేపెల్లి కనకయ్య,దుడ్డేల శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments