
పయనించే సూర్యుడు నిజాంబాద్ జిల్లా బ్యూరో టికే గంగాధర్
తెలంగాణ నిజాంబాద్ జిల్లాలో భీమ్గల్ మున్సిపల్ పరిధిలో కృష్ణవేణి పాఠశాల ఉంది
ఈ రోజు మంగళవారం రోజున ఉదయం సుమారు 08:00 గంటల సమయంలో భీమ్‌గల్ మండలంలోని రహత్‌నగర్ గ్రామంలో రోడ్డు ప్రమాదం జరిగింది.
కృష్ణవేణి టాలెంట్ స్కూల్‌కు చెందిన స్కూల్ బస్సు (నంబర్ TS03UB4394) డ్రైవర్ జి. మధు S/o రమేష్, భీమ్‌గల్, బస్సును నడుపుతూ రహత్‌నగర్ గ్రామానికి వచ్చాడు.ఆ సమయంలో మరణించిన బాలుడి తల్లి శిరీష తన పెద్ద కుమారుడిని స్కూల్ బస్సులో ఎక్కిస్తోంది. ఈ సమయంలో మూడు సంవత్సరాల వయసుగల శ్రీకాంత్ అనే చిన్నారి బస్సు ముందు ఆడుకుంటూ ఉండగా అనుభవం లేని డ్రైవర్, డ్రైవర్ నిర్లక్ష్యంగా బస్సును ముందుకు నడపడం వలన బస్సు చిన్నారిని ఢీకొంది. దీని ఫలితంగా బాలుడికి తీవ్ర తల గాయం అయ్యి, ఆసుపత్రికి తరలించే సమయంలో మరణించాడు.ఈ ఘటనపై భీమ్‌గల్ పోలీస్ స్టేషన్‌లో Cr. No.191/2025 U/Sec. 106(1) BNS ప్రకారం కేసు నమోదు చేసి, దర్యాప్తు కొనసాగించుచున్నారు.– భీమ్‌గల్ పోలీస్ స్టేషన్, నిజామాబాద్ జిల్లా
