జనసేన సీనియర్ నేత రామ శ్రీనివాస్
పయనించేసూర్యుడు అక్టోబర్6 అన్నమయ్య జిల్లా టి సుండుపల్లి మండలం
రహదారులు మరమ్మత్తులు చేయాలని అన్నమయ్య జిల్లా గౌరవనియులైన కలెక్టర్ శ్రీ నిశాంత్ కుమార్ గారికి సోమవారం స్పందన కార్యక్రమంలో వినతి పత్రాన్ని అందజేసినట్లు జనసేన పార్టీ రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గ నాయకులు రామ శ్రీనివాస్ తెలిపారు. రాయచోటి నుండి టి. సుండుపల్లి మీదుగా రాయవరం మరియు పించ వరకు డబుల్ రోడ్డు నిర్మాణం పనులు అర్ధాంతరంగా ఆగిపోయాయని, ఇటీవల కురిసిన భారీ వర్షానికి రోడ్డుకు ఇరువైపులా కోతలకు గురై నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. అలాగే రాయచోటి వయా రాజంపేట రెండు వరుసల రహదారి పనులు అర్ధాంతరగా ఆగిపోయాయన్నారు. అలాగే టి.సుండుపల్లి మండలంలోని అగ్రహారం నుండి సామిసేని గడ్డ వరకు సుమారు 9 పల్లెలకు వెళ్లే రహదారి గుంతల మయంగా మారి వాహనదారులకే కాకుండా బాటసారులు సైతం ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈ సమస్యలన్ని పరిష్కారానికి ఆంద్రప్రదేశ్ రాష్ట్ర గౌరవనియులైన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆంద్రప్రదేశ్ రాష్ట్ర గౌరవనియులైన ఉపముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ బిజెపి రాష్ట్ర గౌరవనియులైన అధ్యక్షులు శ్రీ పి వి ఎన్ మాధవ్ రాష్ట్ర గౌరవనియులైన రోడ్లు భవనాల శాఖ మంత్రి శ్రీ బీసీ జనార్దన్ రెడ్డి అలానే సంబంధిత శాఖల ప్రభుత్వ ఉన్నతాధికారులకు వినతి పత్రాలు అందజేయడం జరిగిందన్నారు. అప్పట్లో అందజేసిన వినతి పత్రాలను కలెక్టర్కు అందజేసినట్లు తెలిపారు. తక్షణమే సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని వినతిపత్రంలో పేర్కొన్నారు.

