
డాన్స్ పోటీలలో పాల్గొన్న న్యూ పవర్ కుంగ్ ఫు అకాడమీ విద్యార్థిని విద్యార్థులు
డాన్స్ పోటీలలో పథకాలు సర్టిఫికెట్లు సాధించిన న్యూ పవర్ కుంగ్ ఫు అకాడమీ విద్యార్థులు
( పయనించే సూర్యుడు జూన్ 11 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ )
విద్యార్థిని విద్యార్థులలోని అంతర్గత నైపుణ్యాలను వెలికి తీయడానికి, వారిలోని సృజనాత్మకతను పెంపొందించడానికి చాలామంది ఎన్నో రకాల కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అలాగే రాక్ స్టార్ డాన్స్ స్టూడియో విద్యార్థిని విద్యార్థులకు డాన్స్ పోటీలను నిర్వహించారు. రాక్ స్టార్ డాన్స్ స్టూడియో వారు నిర్వహించిన పోటీలకు షాద్నగర్ పట్టణానికి చెందిన న్యూ పవర్ కుంఫు అకాడమీ విద్యార్థులు కూడా హాజరయ్యి పోటీలలో పాల్గొన్నారు. పోటీలలో పాల్గొన్న విద్యార్థులు విద్యార్థులు తమ అద్భుతమైన ప్రతిభతో పతకాలను మరియు ప్రశంస పత్రాలను సాధించారు. న్యూ పవర్ కుంగ్ ఫు అకాడమీ విద్యార్థులు డాన్స్ పోటీలలో పాల్గొని పథకాలు ప్రశంసాపత్రాలను సాధించడం పట్ల అకాడమీ నిర్వాహకుడు అహ్మద్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులలోని అన్ని నైపుణ్యాలను వెలికి తీయడానికి ఇలాంటి పోటీలు చాలా దోహదం చేస్తాయని, ఇతర ప్రాంతాల నుండి కూడా వేరే విద్యార్థులు ఈ పోటీలకు వస్తారు కాబట్టి వారి మధ్యన సాన్నిహిత్యం పెరుగుతుందని, కొత్త కొత్త అంశాలు నేర్చుకోవడానికి ఇలాంటి పోటీలు దోహదం చేస్తాయని, కనుక ఇటువంటి అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకుని తమ తమ జీవితాలకు మంచి మార్గాన్ని సుగమం చేసుకోవాలని ఆయన ఆకాంక్షించారు
