
ఎమ్మెల్సీ నాగరకుంట నవీన్ రెడ్డి
ఎమ్మెల్సీ నవీన్ రెడ్డికి రాఖీ కట్టిన తోబుట్టువులు సుస్మిత,సురేఖ మరియు వైస్ మాజీ వైస్ ఎంపిపి మౌనిక హరిక్రిష్ణ గౌడ్
( పయనించే సూర్యుడు ఆగస్టు 09 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ )
రాఖీ పండుగ సోదరి,సోదరుల మధ్య అనుబంధానికి ప్రతీకని,సోదరీమణులు తమ సోదరుల మణికట్టుకు రాఖీ కట్టి వారికి అంత మంచి జరగాలని భగవంతుని కోరుకుంటారన్నారు ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి.రాఖీ పండుగ సందర్బంగా ఎమ్మెల్సి కార్యాలయం షాద్ నగర్ లో ఫరూక్నగర్ మండల మాజీ వైస్ ఎంపీపీ మౌనికహరిక్రిష్ణ గౌడ్ మరియు నవీన్ రెడ్డి సోదరిమణులు వారి నివాసములో సురేఖ,సుస్మిత ఎమ్మెల్సీ నవీన్ రెడ్డికి రాఖీ కట్టి అంత మంచి జరగాలని కోరుకున్నారు.ఈ సందర్బంగా ఉమ్మడి పాలమూరు మరియు షాద్నగర్ నియోజకవర్గ అక్కా చెల్లెలందరికి రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు ఎమ్మెల్సి నవీన్ రెడ్డి.
