
ప్రభుత్వ ఉత్తర్వులను తుంగలో తొక్కుతున్న ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలి.!
ఎస్ఎఫ్ఐ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు వడ్ల శ్రీకాంత్
అక్రమ డిప్యూటేషన్ల ను రద్దు చేయాలని పాఠశాల ముందు ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం నాయకుల ఆందోళన..!
( పయనించే సూర్యుడు ఆగస్టు 12 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ )
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలో రాజకీయ నాయకుల పైరవీలతో డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ మరియు జిల్లా విద్యాశాఖ అధికారుల కార్యాలయాల నుండి కొందరు ఉపాధ్యాయులు ఇప్పటికే ఎక్కువ సంఖ్యలో డిప్యూటేషన్లతో గ్రామీణ గిరిజన ప్రాంతాలను వదిలి హైదరాబాద్ పట్టణ ప్రాంతాలకు క్యూ కడుతున్నారని దాంతో గ్రామీణ గిరిజన ప్రాంతాల విద్యార్థులు విద్యా నష్టపోతున్నారని ఎస్ఎఫ్ఐ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు శ్రీకాంత్ జిల్లేడు చౌదర్ గుడా మండల పరిధిలోని ప్రభుత్వ పాఠశాల ముందు ప్లాక్ కార్డులతో ఆందోళనకు దిగారు చౌదర్ గూడ మండలం మొదలుకొని కొందుర్గు ఫరూక్ నగర్ నందిగామ కొత్తూరు మండలాలతో పాటు జిల్లా వ్యాప్తంగా అక్రమ డిప్యూటేషన్ల పరంపర కొనసాగుతుందని దీనికి రాజకీయ నాయకుల పైరవీలే కారణమని మరియు ఉపాధ్యాయుల అమ్యామ్యాల పర్వంతోనే అక్రమ డిప్యూటేషన్ల పర్వం కొనసాగుతుందని అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఇప్పటికే ఇచ్చిన డిప్యూటేషన్లను వెంటనే రద్దు చేయాలని ప్రభుత్వానిబంధనలను తుంగలో తొక్కుతున్న ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు లేనియెడల జిల్లా వ్యాప్తంగా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు శివశంకర్ ప్రవీణ్ మనీ రాజు తదితరులు పాల్గొన్నారు..