
పయనించే సూర్యుడు మే 21 (పొనకంటి ఉపేందర్ రావు )
ఇల్లందు భారతదేశానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిచయం చేయడమే కాకుండా విప్లమాత్మక మార్పులకు నాంది పలికిన మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ అని ఇల్లందు శాసనసభ్యులుకోరం కనకయ్య తెలిపారు. రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా ఇల్లందు పట్టణంలోని స్థానిక జగదాంబ సెంటర్ నందు రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించిన ఇల్లందు ఎమ్మెల్యే కొరం. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ దేశంలో సాంకేతిక విప్లవానికి నాంది పలికింది స్వర్గీయ రాజీవ్ గాంధీ మాత్రమేనని అంతేకాకుండా అభివృద్ధి చెందుతున్న దేశాల సరసన భారతదేశాన్ని నిలిపిన ఘనత కూడా రాజీవ్ గాంధీ దేనని గుర్తు చేశారు. ఐటీ రంగాన్ని దేశానికి పరిచయం చేసి విప్లమాత్మక మార్పు తెచ్చిన ఘనత రాజీవ్ గాంధీకే దక్కుతుందని అన్నారు. నేటి యువత రాజీవ్ గాంధీ ఆశయాలను అందిపుచ్చుకొని ఆ దిశగా అడుగులు వేస్తూ రాజీవ్ గాంధీ కళలను సహకారం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ డివి, పట్టణ మండల అధ్యక్షులు దొడ్డ డానియల్, పులి సైదులు, పట్టణ మండల కార్యదర్శి జాఫర్, కిరణ్, నియోజకవర్గ నాయకులు బొల్లా సూర్యం, మండల రాము, మడుగు సాంబమూర్తి, చిల్లా శ్రీనివాస్, డి శివకుమార్, జీవి భద్రం, నందకిషోర్, ఎర్రసంగి ఎంకన్న, సుదర్శన్ కోరి, గోపగాని రాజు, చెంచమ్మ, ఇమామ్, ఆజాం, ఐఎన్టీయూసీ నాయకులు జెవి, కాంగ్రెస్ పట్టణ,మండల కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు