
పయనించే సూర్యుడు మే 13 (పొనకంటి ఉపేందర్ రావు )
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించే దిశగా ప్రభుత్వం చేపట్టిన రాజీవ్ వికాసం పథకంలో వచ్చిన దరఖాస్తుల పరిశీలన రెండు రోజుల్లో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా లో రాజీవ్ యువ వికాసం, ఇందిరమ్మ ఇండ్లు మరియు జల్ సంచయ్ జెన్ భాగి దారి అమలు పై ఐటిడిఏ పిఓ రాహుల్ తో కలిసి సంబంధిత అధికారులతో టెలికాన్ఫిడెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాజీవ్ యువ వికాసం పథకంకు వచ్చిన దరఖాస్తుల పరిశీలన వేగవంతంగా పూర్తి చేసి అర్హులైన వారి జాబిత రూపొందించాలన్నారు. పరిశీలన పూర్తి అయిన దరఖాస్తులను ట్రైబల్,ఎస్సీ,ఎస్టీ,బిసి మరియు మైనారిటీ కార్పొరేషన్ వారీగా విభజించాలన్నారు. విభజించిన దరఖాస్తులను బ్యాంక్ అధికారుల పరిశీలన నిమిత్తం అందించాలన్నారు.రాజీవ్ యువ వికాసం అర్హుల జాబితా లో ఒంటరి మహిళలు, వితంతువులు మరియు దివ్యాంగులకు ప్రాధాన్యత కల్పించాలన్నారు. దరఖాస్తులను పరిశీలించిన అనంతరం మండల ప్రత్యేక అధికారులు జాబితాను బ్యాంకు అధికారులకు అందించాలన్నారు. బ్యాంకర్లు సమన్వయంతో ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఆదాయ ధ్రువీకరణ పత్రం, శాశ్వత డ్రైవింగ్ లైసెన్సు, పట్టాదారు పాస్ పుస్తకం, సదరం సర్టిఫికెట్ తదితర ధ్రువపత్రాలను తప్పనిసరిగా పరిశీలించి, దరఖాస్తుదారుల యొక్క సిబిల్ స్కోర్ ఆధారంగా అర్హులను ఎంపిక చేయాలన్నారు. జనాభా ప్రాతిపదికన యూనిట్ల కేటాయింపు ఉంటుందని, గ్రామంలో ఒక యూనిట్ కు ఎక్కువ మంది దరఖాస్తు చేసుకుంటే వాటిని పరిశీలించాలని, ఆ కార్పొరేషన్ల అధికారులను ఆదేశించారు. గ్రామం, మండల మరియు మున్సిపల్ స్థాయిలో వచ్చిన దరఖాస్తులు 50,000 నుండి 5 లక్షల వరకు విడివిడిగా నివేదికలు అందించాలన్నారు. మండల కమిటీ నుంచి వచ్చిన జాబితా అనంతరం మే 21 నుండి 30 వరకు జిల్లా స్థాయి కమిటీ పరిశీలన తరువాత అర్హులైన వారికి ఆవిర్భావ దినోత్సవం జూన్ 2న మంజూరు పత్రాలు అందజేయు విధంగా ప్రణాళికల రూపొందించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల పరిశీలన వేగవంతం చేయాలన్నారు. ప్రతి నియోజకవర్గంలో 3500 ఇండ్లకు గాను ఇప్పటికే మొదటి విడతలో మండలానికి ఒక గ్రామపంచాయతీ ఎంపిక చేసి ఉన్నారని మిగిలిన గ్రామపంచాయతీలలో లబ్ధిదారుల అర్హుల జాబితా క్షేత్రస్థాయిలో పర్యటించి త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. నియోజకవర్గ ప్రత్యేక అధికారులు తమ వద్దకు వచ్చిన జాబితాను సంబంధిత మండలాల ఎంపీడీవోలు లేదా మున్సిపల్ కమిషనర్ల కు అందజేసి వారు స్థానికంగా ఉన్న ఇందిరమ్మ ఇండ్ల కమిటీ సభ్యులు మరియు పంచాయతీ సెక్రటరీల తో సమన్వయం పరచుకొని ఉన్న జాబితాలో పేదల్లో నిరుపేద వారిని గుర్తించి అర్హుల జాబితా రూపొందించాలన్నారు. జాబితాలో పేరు లేని ఎవరైనా నిరుపేదలు ఉంటే వారి పేర్లు కూడా జత పరిచి అర్హుల జాబితా తయారు చేసి స్థానిక శాసనసభ్యులు సహకారంతో జాబితా రూపొందించాలని అన్నారు. జెల్ సంచయ్ జెన్ భాగి దారి అమలులో భాగంగా జిల్లాలో పెద్ద ఎత్తున ఇంకుడు గుంతల నిర్మాణం చేపడుతున్నామన్నారు. రాబోయే వర్షాకాలంలో ప్రతి నీటి బొట్టు ను ఒడిసిపట్టే విధంగా ఇంకుడు గుంతల నిర్మాణాలు చేపడుతున్నామన్నారు. చేపట్టిన ప్రతి ఇంకుడు గుంత ఫోటోలను జె ఎస్ జె బి పోర్టల్ లో అప్లోడ్ చేయాలని, దేశంలో ఇంకుడు గుంతల నిర్మాణంలో మన జిల్లా మొదట స్థానానికి చెరువులో ఉందని, మొదటి స్థానం పొందిన వారికి రెండు కోట్ల రూపాయల బహుమానం లభిస్తుందని కలెక్టర్ తెలిపారు. దీనిలో భాగంగా ఫామ్ పౌండ్స్ కూడా పెద్ద ఎత్తున నిర్మాణాలు చేపడుతున్నామని నిన్న ఒక్కరోజే 230 పామ్ పౌండ్స్ కి మార్కింగ్ చేయడం జరిగిందన్నారు. రాబోయే వర్షాకాలంలో ఏ ప్రభుత్వ కార్యాలయాల్లో, అంగన్వాడి కేంద్రాల్లో, వసతి గృహాల్లో ఎక్కడ కూడా వర్షపు నీరు నిలవకుండా ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు.