
అర్హులైన వారికి నూతన రేషన్ కార్డులు త్వరగా ఇవ్వాలి..
కేసరి మధుకర్ రావు 30 వార్డ్ బి ఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు..
పయనించే సూర్యడు // మార్చ్ // 20 // హుజురాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ // కుమార్ యాదవ్..
తెలంగాణ రాష్ట్రంలో ఈనెల 17న లాంఛనంగా రాజీవ్ యువ వికాస యోజన పథకంను కాంగ్రెస్ ప్రభుత్వం లాంఛనంగా ప్రారంభించింది. ఈ పథకానికి అర్హులుగా రాష్ట్రంలోని బిసి, మైనార్టీ, ఈబిసి, అలాగే ఎలాంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలను పొందని ఎస్సీ, ఎస్టీ, ఫార్వర్డ్ క్లాసుల వారికి రాజీవ్ యువ వికాస యోజన పథకానికి అర్హతలను నిర్దేశించింది. ఇందులో రేషన్ కార్డ్, ఆదాయ ధ్రువీకరణ పత్రం, కులం సర్టిఫికెట్, ఆధార్ కార్డ్, స్టడీ సర్టిఫికెట్లను, ఒక ఫోటోను జతపరచాలని సూచించింది. కానీ ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం రెండవ దఫా ప్రజా పాలన కార్యక్రమంలో అర్హులైన వారి నూతన రేషన్ కార్డుల లిస్టును ఎంపిక చేసిన ప్రజా పాలన కార్యక్రమంలో సంబంధిత అధికారులు ఎంపిక అయిన వారి పేర్లను చదివారు. వీరికి త్వరలో కొత్త రేషన్ కార్డులు అందిస్తామని చెప్పారు. కానీ ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎంపిక అయిన వారి కొత్త రేషన్ కార్డులను ఇవ్వలేదు. ఆ తర్వాత మళ్లీ కొత్త రేషన్ కార్డుల ఎంపిక నిరంతర ప్రక్రియని ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం కోరింది. దానితో కొంత మంది రెండవ దఫా ప్రజా పాలనలో కొత్త రేషన్ కార్డు ల ను దరఖాస్తు చేసుకోని వారు తిరిగి మళ్లీ వారు ఆన్ లైన్ లో కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. కానీ వారికి ఇప్పటి వరకు ఎలాంటి కొత్త రేషన్ కార్డు ప్రభుత్వం ఇవ్వలేదు. దీంతో కొత్త రేషన్ కార్డుకు అర్హత కలిగిన వారు రాజీవ్ యువ వికాస యోజన పథకానికి వారు దరఖాస్తు చేసుకోలేకపోతున్నారు. ఎందుకంటే వారికి రేషన్ కార్డు లేదు కాబట్టి వారికి త్వరగా కొత్త రేషన్ కార్డులను కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చి వారికి రాజీవ్ యువజన వికాస యోజన పథకానికి అర్హులైనట్లు చేయాలని, తెలంగాణలోని రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, అలాగే జిల్లా, రెవెన్యూ డివిజనల్, మండల రెవెన్యూ, అలాగే మున్సిపల్ పరిధిలోని కమిషనర్లను హుజురాబాద్ 30వ వార్డు బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసరి మధుకర్ రావు సంబంధిత అధికారులను కోరారు.