
పయనించే సూర్యుడు సెప్టెంబర్ 30 మధిర న్యూస్ *స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చూపించండి*: *రేణుక చౌదరి* మాజీ కేంద్రమంత్రి ప్రస్తుత రాజ్యసభ సభ్యురాలు తెలంగాణ రాజకీయాలకు ఫైర్ బ్రాండ్ శ్రీమతి రేణుక చౌదరికి విజయదశమి సందర్భంగా హైదరాబాద్ వారి నివాసంలో ఖమ్మం జిల్లా సీనియర్ కాంగ్రెస్ నాయకులు జవ్వాజి ఆనందరావు మిత్ర బృందం విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా రేణుక చౌదరి కాంగ్రెస్ నాయకులతో మాట్లాడుతూ పల్లెల్లో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చూపించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకొని పోయి కాంగ్రెస్ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని నాయకులకు రేణుక చౌదరి సూచించారు. అనంతరం జవ్వాజి ఆనందరావు ఆధ్వర్యంలో రేణుక చౌదరిని శాలువాతో సత్కరించారు. వారి వెంట కాంగ్రెస్ నాయకులు గురుబ్రహ్మం, దోర్నాల వెంకటరవి, తదితరులు పాల్గొన్నారు.