
పయనించే సూర్యుడు అక్టోబర్ 4 ( సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు) సూళ్లూరుపేట మున్సిపాలిటీ పరిధిలోని మాల మహానాడు స్టేట్ ఆర్గనైజేషన్ సెక్రటరీ ఆవులు దాస్ భారతదేశ సమైక్యత కోసం బలహీన వర్గాల కోసం పోరాడి రాజ్యాంగాన్ని రచించిన మన భారత దేశ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ విగ్రహానికి వెదురు కుప్పం మండలం.బొమ్మేపల్లి పంచాయితీ దేవళంపేట గ్రామంలో నిప్పు పెట్టిన నిందితులను గుర్తించి వారిపై కఠిన చర్య తీసుకోవాలని
మాలమహానాడు స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆవల దాస్ డిమాండ్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిందితులను గుర్తించి పారదర్శకంగా విచారణ జరిపించాలి. అసలు నిందితులని గుర్తించి వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాము. చిత్తూరు జిల్లా పరిధిలో ఇలాంటి సంఘటన చోటు చేసుకోవడం చాలా బాధాకరం. ఈ విషయాన్ని రాజకీయం ఆరోపణలు ప్రత్యారోపణలు మంచిది కాదు. పోలీస్ శాఖ వారు నిష్పక్షపాతంగా వ్యవహరించి అసలు నిందితులను పట్టుకొనవలసిందిగా కోరుచున్నాము. మళ్లీ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని
మాలమహానాడు నుండి డిమాండ్ చేస్తున్నాము.