
( పయనించే సూర్యుడు మే 08 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ )
ఈ రోజు చౌదరిగూడ మండలంలోని రావిర్యాల గ్రామంలో నిర్వహించిన జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ యాత్ర కార్యక్రమంలో షాద్ నగర్ ఎమ్మెల్యే, ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ చైర్మన్ వీర్లపల్లి శంకర్ గారు పాల్గొని గ్రామంలో పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మతతత్వ శక్తులు రాజ్యాంగాన్ని, అంబేద్కర్ ను అవమానించేలా వ్యాఖ్యలు చేస్తూ రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మూలంగా సమాజంలో అట్టడుగు స్థాయిలో ఉన్న ప్రతి పౌరుడు ఉన్నత స్థానానికి ఎదిగేందుకు అవకాశాలు కల్పించబడ్డాయి అని తెలిపారు. అందరికీ రాజ్యాంగ పరిరక్షణ నినాదం కాదని, ప్రతి ఒక్కరి బాధ్యత అని చాటి చెప్పడానికే దేశవ్యాప్తంగా పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రావిర్యాల గ్రామంలో ఇప్పటికే 47 లక్షల నిధులను మంజూరి చేసి పనులు పూర్తి చేశామని తెలిపారు. దశలవారీగా అందరూ అర్హులకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు రాజు, కొందూర్గ్ మండల అధ్యక్షుడు కృష్ణా రెడ్డి,నందిగామ మండల అధ్యక్షుడు జంగ నర్సింహులు,మార్కెట్ వైస్ చైర్మన్ బాబర్ ఖాన్,మాజీ జడ్పీటీసీ విశాల శ్రవణ్ రెడ్డి, అగ్గనూరు విశ్వం, కొంకళ్ళ చెన్నయ్య, పురుషోత్తం రెడ్డి,జితేందర్ రెడ్డి,రోహిత్ రెడ్డి,కొమ్ము కృష్ణ,అందే మోహన్, ముబారక్ అలీ ఖాన్ , సీతారాం,తుపాకుల శేఖర్,మాజీ సర్పంచులు నర్సప్ప గూడ కృష్ణ, నర్సింహులు,స్థానిక నాయకులు నీలయ్య,శివ కుమార్, జంగయ్య,రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.