
రుద్రూర్, సెప్టెంబర్ 29 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి) : రుద్రూర్ మండలంలోని
రాయకూర్ గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లిమిటెడ్ రాయకూర్ సంఘం వద్ద సహకార సంఘం ఛైర్మెన్ పరుచూరి సంఘమేశ్వర్ రావు ఆధ్వర్యంలో సోమవారం మహాజన సభ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా కార్యదర్శి లావాదేవిలను చదివి వినిపించారు. ఈ కార్యక్రమంలో సహకార సంఘ ఉపాధ్యక్షులు తోట అరుణ్ కుమార్, సంఘ డైరెక్టర్ షేక్ రియాజ్ పాషా, కొబ్బడి నారాయణ, ఎర్రోళ్ల శ్రీనివాస్, తాటే సవిత, సంఘ పరిధిలోని గ్రామాల సంఘ సభ్యులు, సంఘ కార్యదర్శి ఎర్రోళ్ల సాయికిరణ్, సంఘం సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.