
విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ ను ప్రారంభిస్తున్న అధికారులు..
రుద్రూర్, మార్చ్ 11 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి) : రుద్రూర్ మండలంలోని రాయకూర్ గ్రామంలో మంగళవారం 25 కేవీ ట్రాన్స్ ఫార్మార్ ను విద్యుత్ శాఖ అధికారులు ప్రారంభించారు. గ్రామంలో నిరంతరాయంగా విద్యుత్ ను అందించే దిశగా విద్యుత్ వినియోగదారుల సౌలభ్యం, వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని 25 కెవి గల ట్రాన్స్ ఫార్మర్లను గ్రామ పెద్దలు, గ్రామస్తుల సమక్షంలో విద్యుత్ శాఖ అధికారులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రుద్రూర్ ఏఈ శ్రీనివాస్, ఎల్ ఐ రాజేశాం, లైన్ మెన్ సబీల్ , ఏఎల్ ఎం ఆనంద్, సీఎల్ కరీం, ఆనంద్, రాయకూర్ గ్రామ మాజీ సర్పంచ్ గంగారాం, గోవిందారావు, లక్ష్మయ్య, వార్డ్ సభ్యులు సాగర్, కారోబార్ శంకర్ అప్ప, మాజీ ఎంపీటీసీ అనిల్ తదితరులు పాల్గొన్నారు.