
పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టికే గంగాధర్
తెలంగాణ హైదరాబాద్ లోని ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ విశ్వవిద్యాలయం నందు రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్రంలోని 311 సహకార సంఘాల అధ్యక్షులు సీఈఓ లతో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మరియు సహకార మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. అదేవిధంగా సహకార బ్యాంకు అధ్యక్షులు రవీందర్ రావు ,నిజామాబాద్ డీసీసీబీ చైర్మన్ రమేష్ రెడ్డి,వివిధ జిల్లా ల డీసీసీబీ ల అధ్యక్షులు పాల్గొన్నారు
