క్రీడా స్ఫూర్తిని చాటాలి.. సాధనతో ఏదైనా సాధించవచ్చు.. అఖండ ఫౌండేషన్ అధ్యక్షులు విన్నకోట సురేష్..
మానసిక ఉల్లాసాన్ని పెంపొందించడంలో క్రీడలు పాత్ర క్రీడా పోటీలలో గెలుపు ఓటములు సహజం.. కాకి రమేష్…
పయనించే సూర్యుడు బాపట్ల జనవరి 11:- రిపోర్టర్( కే శివకృష్ణ)
సంక్రాంతి పండగ సందర్భంగా బాపట్ల మాజీ కబాడీ క్రీడాకారుల ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి కబడ్డీ టోర్నమెంట్ ను శనివారం బాపట్ల పట్టణ మునిసిపల్ హై స్కూల్ నందు కబడ్డీ పోటీలు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన అఖండ ఫౌండేషన్ అధ్యక్షులు విన్నకోట సురేష్, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన విన్నకోట సురేష్ కబాడీ ప్లేయర్లను పరిచయం చేసుకున్నారు. విద్యార్థులు విద్యాపరంగా క్రీడా పరంగా రాణించాలని జిల్లాకు రాష్ట్రానికి దేశానికి తమ సేవలను అందించాలని విన్నకోట సురేష్ పిలుపునిచ్చారు. పోటీల సమయంలో ఎదురయ్యే ఎదురుదెబ్బలు నిరుత్సాహానికి గురి కాకూడదని, ప్రతి ఓటమి భవిష్యత్తు విజయానికే అవకాశం గా నిలుస్తుందని క్రీడల్లో పాల్గొనే వారికి భరోసా ఇచ్చారు. నైపుణ్యం కలిగిన క్రీడాకారులు వారి స్థానిక ప్రాంతాలకు మించి గుర్తింపు పొందాలని ఆకాంక్షించారు…
ఇంకో ముఖ్యఅతిథిగా విచ్చేసిన కాకి రమేష్ మాట్లాడుతూ; క్రీడలు శారీరిక దారుఢ్యంతో పాటు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని చిన్నతనం నుంచి క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలన్నారు పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని క్రీడ పోటీల్లో ప్రతి ఒక్కరు గెలుపు ఓటములను పట్టించుకోకుండా క్రీడా స్ఫూర్తిని చాటాలన్నారు. క్రీడల్లో ముందుకు సాగాలంటే సాధనే ముఖ్యమని తెలిపారు..
అనంతరం బాపట్ల మునిసిపల్ హై స్కూల్ ఫిజికల్ డైరెక్టర్ ఎన్సిసి ఆఫీసర్ కత్తి శ్రీనివాసరావు మాట్లాడుతూ; ఈ పోటీలు రెండు రోజులు జరుగుతాయని అందులో భాగంగా ఆరు జిల్ల�