
పయనించే సూర్యుడు గాంధారి 30/03/25
గాంధారి మండలంలోని సర్వాపూర్ గ్రామంలో గల ఇన్స్ స్పైర్ బ్రిడ్జ్ స్కూల్ విద్యార్థులు ఏకలవ్య ఒలంపియాడ్ ఐఐటి అకాడమిక్ ఆధ్వర్యంలో హైదరాబాదులో నిర్వహించిన రాష్ట్రస్థాయి ఒలంపియాడ్ ,ఐఐటి పరీక్షలలో ఇన్స్ స్పైర్ బ్రిడ్జ్ స్కూల్ విద్యార్థులు పాల్గొని రాష్ట్రస్థాయి లో విజేతలుగా నిలిచారు. మారుమూల ప్రాంత విద్యార్థులు ఒలంపియాడ్, ఐఐటి పరీక్షలలో ప్రతిభ కనబరచడం మన ప్రాంతానికి గర్వాకరణమని ప్రిన్సిపాల్ జ్ఞానేశ్వర్ గౌడ్ పేర్కొన్నారు. ఐ ఐ టి విజేతలకు రామకృష్ణ మఠ్ అధ్యక్షులు బోధమాయనంద జ్ఞాపికలను అందించారు ఈ కార్యక్రమంలో స్కూల్ డైరెక్టర్స్ వినయ్ , సాయికుమార్ లు పాల్గొన్నారు.