
మలేషియా దేశానికి చెందిన మాస్టర్ చేతుల మీదుగా బహుమతులు అందజేత
విద్యార్థులు నా అభినందించిన బుడోఖాన్ కరాటే మాస్టర్స్
( పయనించే సూర్యుడు అక్టోబర్ 13 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ )
రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలోని రంగనాయక ఆడిటోరియంలో జరిగిన రాష్ట్ర స్థాయి కరాటే పోటీల్లో కొత్తూరు మండలం సిద్దాపూర్ మరియు చింతగట్టు తండాకు చెందిన విద్యార్థులు పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబరిచారు. పోటీలు జరిగిన క్యాటగిరిలో పటాస్ విభాగంలో రష్మిక, మీనాక్షి మొదటి బహుమతి గెలవగా, అక్షయ్ రాజేష్ షర్మిల సుహాసిని ముస్కాన్ రెండో బహుమతి గెలుపొందగా, సబిత మీనా అంకిత అక్షయ సుహాసిని మూడో బహుమతి గెలుపొందారు. గెలుపొందిన విద్యార్థులకు మలేషియా దేశానికి చెందిన సీనియర్ గ్రాండ్ మాస్టర్ చేతుల మీదుగా బహుమతులను అందుకోవడం జరిగిందని చింతగట్టుకు చెందిన సీనియర్ కరాటే మాస్టర్ పీరు నాయక్ తెలిపారు. ఈ కార్యక్రమంలో యాదవ్ బ్రోకన్ కరాటే క్లబ్ డిప్యూటీ గ్రాండ్ మాస్టర్ సాయినాథ్ కరాటే సీనియర్ మాస్టర్ నరేందర్ నాయక్ కరాటే మాస్టర్ పీరు నాయక్, ఉత్తేజ్, గోపి నాయక్, వినయ్, రాహుల్, తరుణ్ తదితరులు పాల్గొన్నారు.
