పయనించే సూర్యుడు జనవరి 12
మంచిర్యాల్ జిల్లా మంచిర్యాల్ మండల్
రిపోర్టర్ (గొడుగు ఆశీర్ విల్సన్)
ఈరోజు మంచిర్యాలలోని ఐబి చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహం వద్ద బీసీల న్యాయమైన హక్కుల కొరకై
రాష్ట్ర ప్రభుత్వము బీసీల న్యాయపరమైన హక్కులు పరిష్కరించాలని మోకాళ్లపై నిరసన
హక్కులు
1) నామినేటెడ్ పదవులలో 50% రిజర్వేషన్ కల్పిస్తూ చట్టం చేయాలి
2) బిసి ఫెడరేషన్లకు పాలకమండలి ఏర్పాటు చేసి నిధులు ఏర్పాటు చేయాలి
3) లక్ష కోట్లతో బీసీ సబ్ ప్లాన్
ఏర్పాటు చేయాలి
4) బీసీ కార్పొరేషన్ కు చైర్మన్ ను నియమించాలి
5) కొత్తగా ఏర్పాటు చేసిన కార్పొరేషన్లకు చట్టబద్రత కల్పించాలి,, ఒక్కొక్క కార్పొరేషన్ కు 2000 కోట్ల నిధులు మంజూరు చేయాలి
6) జనాభా ప్రాతిపదికన బడ్జెట్ కేటాయించాలి
7) అవుట్సోర్సింగ్ ఉద్యోగాలలో బీసీలకు 50% రిజర్వేషన్ కల్పించాలి
8) హత్యాచార నిరోధక చట్టాన్ని బీసీలకు కూడా వర్తింపచేయాలి
9) రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలలో బీసీలకు కూడా 50 % రిజర్వేషన్లు కల్పించాలి
10) ప్రభుత్వ టెండర్లలో బీసీలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించాలని ఈరోజు మంచిర్యాల లోని ఐబి చౌరస్తాలో రాష్ట్ర ప్రభుత్వం మా న్యాయపరమైన హక్కులను పరిష్కరించాలని కోరుతూ జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో మోకాళ్లపై నిల్చుని నిరసన వ్యక్తం చేయడము
ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు గుమ్ముల శ్రీనివాస్,రాష్ట్ర కార్యదర్శి అక్కల రమేష్,, బీసీ గౌరవ అధ్యక్షులు కర్రే లచ్చన్న,, డాక్టర్ బొడ్డు రఘునందన్,, శాఖపురి భీమ్ సేన్,, శ్రీపతి రాములు, కీర్తి బిక్షపతి,గుండ రాజమల్లు, బండ సతీష్,ఆరిందుల రాజేశం, రామగిరి రాజన్న చారి, చంద్రగిరి చంద్రమౌళి,,, సిరిపురం రాజయ్య,, మగ్గిడి తిరుపతి తదితరులు పాల్గొన్నారు